Begin typing your search above and press return to search.

నడుము పట్టు - హిట్టు కొట్టు

By:  Tupaki Desk   |   18 Sep 2018 8:00 AM GMT
నడుము పట్టు - హిట్టు కొట్టు
X
కాకతాళీయంగా జరుగుతాయో లేక ఒకేలా ఆలోచించడం వల్ల వస్తాయో కానీ కొన్ని సినిమాల్లో కనిపించిన షాట్స్ ఇంకోదాంట్లో కనిపించినప్పుడు ఆశ్చర్యం అనిపించడం సహజం. ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే టీజర్ విషయంలో అలానే అనిపిస్తోంది. నిన్నవిడుదల చేసిన టీజర్లో నడుముకు కాఫీకి మధ్య లింక్ పెడుతూ స్వీట్ రొమాన్స్ ని పండించిన తీరు అభిమానులతో పాటు యూత్ ని సైతం బాగా ఆకట్టుకుంది. ఇక దీనికి గీత గోవిందం టీజర్ కు కనెక్షన్ కుదరటమే ఇంకో షాక్ కలిగించే ట్విస్ట్. విడుదలకు ముందు విడుదల చేసిన టీజర్ లో విజయ్ దేవరకొండ అచ్చం హలో గురు ప్రేమ కోసమే టీజర్ లో రామ్ లాగే వెనుక నుంచి రష్మిక మందన్న తడి జుట్టును ఆరబెట్టుకుంటుండగా వెనుక నుంచి తన నడుము భాగాన్ని అలా మైమరిచిపోయి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చే షాట్ లో రష్మిక విజయ్ కు కాఫీ గ్లాసు పట్టుకుని తీసుకు వస్తే ఇందులో మాత్రం ఆల్రెడీ పెట్టేసిన కాఫీ ఎలా ఉందని అనుపమ అడుగుతుంది. గీత గోవిందం టీజర్ లో మాటలు లేవు ఇందులో ఇద్దరు మాట్లాడుకుంటారు. అదొక్కటే తేడా.

సాధారణంగా హీరోయిన్ అందాన్ని అతిగా కాకుండా రొమాంటిక్ గా ప్రేక్షకులు ఆమోదించేలా ఎక్స్ పోజ్ చేయాలంటే నడుమును మించిన ఆయుధం లేదు. దర్శకుడు త్రినాథరావు అది గుర్తించే టీజర్ ని ఇలా కట్ చేయించాడు. అప్పుడెప్పుడో పదిహేనేళ్ల వెనుక ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య జరిగిన నడుము గొడవ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. దాదాపు అందరు హీరోలు ఏదో ఒక సినిమాలో ఏదోఒకరంగా నడుముతో కనెక్షన్ పెట్టుకుని హిట్ కొట్టిన వాళ్లే. గుడుంబా శంకర్ లో ఏకంగా నడుము మీద సిరివెన్నెల గారు పాటే రాసారు. సో చూస్తుంటే గీత గోవిందంలో లైట్ గా కనిపించిన నడుము హలో గురు ప్రేమ కోసమేలో కాస్త టైట్ గా బరువుగా కనిపిస్తూ అభిమానులను బాగా టెంప్ట్ చేసేలా ఉంది. అందుకేనేమో ఇరవై నాలుగు గంటలు గడవకుండానే మిలియన్ వ్యూస్ దాటేసింది. సరిగ్గా చూపాలే కానీ నడుమును హిట్ ఫార్ములాగా వాడుకోవచ్చు.