2 రోజుల్లోనే 25 కోట్ల కొల్లగొట్టిన గోవింద్!

Fri Aug 17 2018 20:00:20 GMT+0530 (IST)


`అర్జున్ రెడ్డి`వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో విజయ్ గత ఏడాది టాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ చాపకింద నీరులా వచ్చి...ఓవర్ నైట్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ మూవీలో రా బోల్డ్ గా నటించిన విజయ్ ....తాజాగా గీత గోవిందం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గోవింద్ వంటి సాఫ్ట్ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు దాదాపు రూ. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన గోవింద్....రెండో రోజు అదే జోరును కొనసాగించాడు. వర్కింగ్ డే అయినప్పటికీ....రెండో రోజు కూడా దాదాపు గోవిందుడు 9 కోట్లు వసూలు చేశాటని ట్రేడ్ టాక్ వస్తోంది.`గీత గోవిందం` మీడియం రేంజ్ సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కు దూసుకు పోతోంది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు 25 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందంటే విజయ్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. తొలి రెండు రోజులు కలిపి ఈ సినిమా దాదాపు రూ.15.70 కోట్ల షేర్ ను రాబట్టిందని ట్రేడ్ టాక్. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యధిక వసూళ్లు ఇవే కావడం విశేషం. గురువారం లాగే  శుక్ర వారం కూడా 9 కోట్లు కలెక్షన్లు వచ్చినా.....శని ఆదివారాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ కావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మొదటి 5 రోజుల్లోనే `గీత గోవిందం` 50 కోట్ల మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని చిత్ర నిర్మాతలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 15 కోట్లకు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను అమ్మగా...రెండు రోజుల్లోనే 15.70 కోట్ల షేర్ ను రాబట్టి లాభాల బాటలో పయనిస్తోంది. మరోవైపు మరే చిత్రం పోటీ లేకపోవడంతో.... ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ శాటిలైట్ రైట్స్...ఫుల్ రన్ కలెక్షన్లు కలిపి....ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని విజయ్ రౌడీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.