Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ స్పెషల్ సపోర్ట్ ఇస్తోందా?

By:  Tupaki Desk   |   24 May 2018 6:02 AM GMT
గీతా ఆర్ట్స్ స్పెషల్ సపోర్ట్ ఇస్తోందా?
X
అదృష్టం చిక్కినట్టే చిక్కి చేప పిల్లలా జరిపోతే ఎలా ఉంటుందో ఊహలకు కూడా తెలియదు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి చేప అదృష్టలు చాలనే ఉంటాయి. ఈ మధ్య యంగ్ బ్యూటీ అను ఇమ్మన్యుయేల్ పరిస్థితి కూడా అలానే మారింది. అవకాశాలు వచ్చాయి కానీ బాక్స్ ఆఫీస్ హిట్టు మాత్రం అందలేదు. ఆజ్ఞతవాసి - నా పేరు సూర్య సినిమాల్లో అవకాశం రాగానే లక్కీ గర్ల్ అనుకున్నారు.

ఇక ఆ సినిమాల రిజల్ట్ తరువాత అమ్మడికి ఓ బ్యాడ్ నేమ్ కూడా వచ్చి పడింది. ప్రమోషన్స్ లో ఏ మాత్రం పాల్గొనదు అని ఇటీవల కాలంలో క్లియర్ గా అర్ధమయ్యింది. నా పేరు సూర్య ప్రమోషన్స్ లో బన్నీ తీరిక లేకుండా పాల్గొంటే అను కనీసం ఒక్క ప్రమోషన్ లో కూడా దర్శనం ఇవ్వలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గతంలో మెగా కాంపౌండ్ లో కూడా అమ్మడి ప్రవర్తన గురించి అప్సెట్ అయ్యారని టాక్ వచ్చింది. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం అనుకి స్పెషల్ రోల్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యింది.

విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో గీతా ఆర్ట్స్ వారు అనుకి పది నిమిషాల స్పెషల్ రోల్ ఇచ్చారట. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. ఇకపోతే గీత ఆర్ట్స్ - శైలజా రెడ్డి అల్లుడు సినిమా కోసం అమ్మడు ఒక ఆఫర్ ని కూడా వదిలేసుకుంది. రవితేజ - అమర్ అక్బర్ అంథోని సినిమాలో ఆవకాశం వచ్చినా కూడా ఆ సినిమా డేట్స్ క్లాష్ అవుతున్నాయని నో చెప్పిందట. మొత్తానికి అమ్మడి పై ఎలాంటి రూమర్స్ వస్తున్నా కూడా గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఫుల్ గా ఉందనే చెప్పాలి.