ఈ కాంబో కుదురుతుందా మహేష్ ?

Sat May 18 2019 13:27:10 GMT+0530 (IST)

ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ అనిల్ రావిపూడి మూవీ కోసం రెడీ అవుతున్న మహేష్ బాబు ఈ మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని హాలిడే కోసం ఫ్యామిలీతో సహా యుకె వెళ్లనున్నాడు. దీని తర్వాత ఏ మూవీ ఉంటుందన్న స్పష్టత మాత్రం రావడం లేదు. గీత గోవిందం ఫేం పరశురాం ఒక లైన్ వినిపించాడని అది నచ్చి ఫుల్ నెరేషన్ తో రమ్మని  మహేష్ చెప్పినట్టుగా కొద్ది రోజుల క్రితమే న్యూస్ లీక్ అయ్యింది.ప్రిన్స్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేయాలనీ ఎప్పటి నుంచో ప్లానింగ్ లో అల్లు అరవింద్ కోసమే ఈ ఇద్దరు కాంబో అవుతున్నట్టుగా కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మహేష్ కు నచ్చేలా కథను వండటంలో పరశురాం టీం తలమునకలై ఉన్నట్టు తెలిసింది. తనకు స్టొరీ నచ్చకపోతే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడికైనా నో చెబుతానని సుకుమార్ విషయంలో మహేష్ ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. అందులో మొహమాటమే ఉండదు

ఇప్పుడు పరశురాం ఆ అంచనాలు అందుకునేలా కథ చెబితేనే మహేష్ ఎస్ చెబుతాడు లేదంటే కథ మళ్ళి మొదటికే వస్తుంది. పరశురాం ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నాడు. మిగిలిన హీరోలు కూడా పెద్దగా ఎవరూ అందుబాటులో లేరు. బ్లాక్ బస్టర్ వచ్చాక ఎక్కువ గ్యాప్ వస్తే ఇలాంటి దర్శకులకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎలాగైనా మహేష్ ని ఒప్పించాలనే ఉద్దేశంతో పక్కాగా రాసుకుంటున్నట్టు వినికిడి.

మరోవైపు కబీర్ సింగ్ రిలీజయ్యాక సందీప్ రెడ్డి వంగా మహేష్ కోసం ఒక లైన్ చెప్పబోతున్నాడు. అనిల్ రావిపూడి తర్వాత మహేష్ కి ఈ ఇద్దరిలో ఎవరు చెప్పింది నచ్చుతుందో అనే దాని మీదే నెక్స్ట్ ప్రాజెక్ట్ డిసైడ్ అవుతుంది. ఈ సస్పెన్స్ ఇప్పటికిప్పుడు తేలేది కాదు కాని కొంత కాలం వేచి చూడక తప్పదు