ట్రైలర్ టాక్: చాయిస్ ఈజ్ యువర్స్

Sat Jan 13 2018 14:28:00 GMT+0530 (IST)


పెళ్ళయిన కొత్తయిలో వంటి సినిమాతో అప్పుడెప్పుడో ప్రూవ్ చేసుకున్న రచయిత దర్శకుడు మదన్.. ఆ తరువాత కాస్త స్ర్టగుల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో ''గాయత్రి'' అనే సినిమాతో వస్తున్నాడు. సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.అవతల హీరో డైలాగ్ కింగ్ కాబట్టి.. ఖచ్చితంగా టీజర్లో డైలాగ్ ఉండాల్సిందే. అందుకే సినిమా థీమ్ ను చెప్పేస్తూ ఇప్పుడు ఒక టీజర్ తో ముందుకొచ్చారు. ''పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళూ వాళ్లూ కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కాని వారి మూలంగా జరిగిన యుద్దంలో అటూ ఇటూ కొన్ని లక్షలమంది చనిపోయారు. పురాణాల్లో వారు చేసింది తప్పయితే ఇక్కడ నేను చేసిందీ తప్పే. అక్కడ వాళ్లు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే.  అర్ధం చేసుకుంటారో అపార్ధం చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్'' అంటూ మోహన్ బాబు మెప్పించారు. అయితే సినిమాలో ఆయనో లాయర్.. అలాగే మరో పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే హెయిర్ స్టయిలింగ్ విషయంలో మాత్రం కాస్త తేడా కొట్టింది.

ఇకపోతే సినిమా ఆద్యంతం ఒక థ్రిల్లర్ తరహాలో సాగనుందని అర్ధంచేసుకోవచ్చు. జర్నలిస్టుగా అనసూయ.. మోహన్ బాబు కూతురుగా నిఖిలా విమల్.. ఈ సినిమాలో కనిపిస్తున్నారు. మోహన్ బాబు యుక్త వయస్సు పాత్రను విష్ణు.. అలాగే ఆయన గాళ్ ఫ్రెండ్ పాత్రలో శ్రీయ కనిపించనున్నారు కాని.. టీజర్లో వారిని చూపించలేదులే. ఇకపోతే ఈ టీజర్ లో థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలాగే సర్వేష్ మురారి కెమెరా వర్క్ చాలా ఇంప్రెస్ చేస్తున్నాయి.