ఈ సురేష్.. ఆ సురేష్ చెల్లి కాదు

Tue Oct 24 2017 12:44:52 GMT+0530 (IST)

కీర్తి సురేష్.. నిత్యా నరేష్.. నబితా నటాష్.. ఇవన్నీ ఏదో రైమింగ్ కోసం రాసిన పేర్లు కాదండోయ్. నిజంగానే ఇప్పుడు తెలుగులో అదృష్టం పరీక్షించుకుంటున్న హీరోయిన్లు పేర్లు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ రైమింగు లిస్టుకు టైమింగుతో ఒక పేరొచ్చి చేరింది. ఆ పేరు చూసి అందరూ ఆమె కీర్తి సురేష్ చెల్లెలా అంటున్నారు. ఇంతకీ ఎవరో చూద్దాం పదండి.రాజ్ తరుణ్ ఇప్పుడు 'అలా ఎలా' ఫేం అనీష్ కృష్ణ డైరక్షన్లో 'లవర్' అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో గాయత్రి సురేష్ అనే అమ్మాయి పరిచయం అవుతోంది. అయితే ఈ పేరు వినగానే అందరూ ఆమెను కీర్తి సురేష్ చెల్లెలా అనుకుంటున్నారు. కాని అస్సలు కాదండీ బాబు. 2014లో మిస్ కేరళ కిరీటాన్నీ గెలుచుకున్న ఈ హాట్ మోడల్.. ఆ తరువాత మలయాళం సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఒక అరడజను సినిమాలు చేసింది. పెద్దగా బ్రేక్ రాలేదేమో కాని.. అమ్మడు డెబ్యూ చేస్తున్న కొత్తమ్మాయ్ కాదు. కాకపోతే తెలుగులోకి తొలిసారి ఎంట్రీ ఇస్తోంది అంతే.

అయితే అందాల పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. అమ్మడు మాత్రం గ్లామర్ కు బారెడంత దూరం అంటోంది. తన నటనతోనే ఆకట్టుకుంటాను అని చెబుతోంది. ఇప్పటికే మన దగ్గర నిత్యా మీనన్ నుండి కీర్తి సురేష్ వరకు.. బోలెడమంది మల్లూ బ్యూటీలు ఉండగా.. ఇప్పుడు ఆ గ్యాంగులో ఈ పిల్ల కూడా చేరుతోంది అనమాట.