లేడీ కొరియోగ్రాఫర్.. బూతులొక్కటే తక్కువ!!

Fri Jan 12 2018 05:00:01 GMT+0530 (IST)


ఇవాల్టి రోజుల్లో సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువైపోయింది. దాని పర్పస్ ఏంటో తెలుసుకోకుండా.. సెలబ్రిటీలను నానా మాటలు అనేందుకే ఎక్కువగా ఉపయోగించేస్తున్నారు. ట్రాలర్స్.. స్టాకర్స్.. ఇలా రకరకాల పేర్లతో వేధింపులకు గురి చేస్తున్నారు. వీటిపై లేడీ కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ విరుచుకుపడిపోయింది."మీమ్ క్రియేటర్లు.. ట్రాల్ స్టాకర్స్.. అసలు వీళ్లు వందల కొద్దీ అకౌంట్లు ఎందుకు సృష్టిస్తారో అర్ధం కాని విషయం. వాళ్లకు అసలు జీవితం ఉందా? వాళ్లకు ఇంత ఫ్రస్టేషన్.. డిప్రెషన్ ఎందుకో? వాళ్లకు ఉద్యోగం లేదనా? లేక బోలెడన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినందుకా? ఈ క్రియేటివిటీ అంతా ఏదైనా స్క్రిప్ట్ రాసుకునేందుకో.. లేకపోతే ఇంకేదైనా ప్రొడక్టివ్ గానో ఉపయోగించుకోవడం ఉత్తమం. నాకు వాళ్ల ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా ఒకరిని నాశనం చేయడానికి ఎంత క్రియేటివిటీ ప్రదర్శిస్తారో.. వీళ్ల సెలబ్రిటీల మీద కాకుండా. వారి కుటుంబ సభ్యుల పై ఈ ట్యాలెంట్ చూపించచ్చు కదా. ఫన్ కోసం అయితే.. ఇతరులను హర్ట్ చేయడం ఎందుకు" అంటోంది గాయత్రి రఘురామ్.

"హాసిని అనే చిన్నారిని.. సొంత తల్లిని మతిస్థితితం లేక హత్య చేసిన వ్యక్తితో ఇలా ట్రాలింగ్ చేసేవాళ్లను పోల్చవచ్చు. ఇలాంటి వాళ్లు వారి కుటుంబాన్ని.. స్నేహితులకు కూడా ప్రమాదకరమే. వీరి గురించి రిపోర్ట్ చేయండి. నన్ను అన్నారని ఇలా చెప్పడం లేదు. ఈ కంపెనీలపై కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ల పేరెంట్స్ కూడా వీరిపై ఓ కన్నేసి ఉంచాలి" అంటూ గుర్రుమంటోంది గాయత్రి.