హీరోయిన్ ను ఒక రాత్రి అంటూ..!

Thu Dec 13 2018 21:55:17 GMT+0530 (IST)

హీరోయిన్స్ కు సెక్సువల్ హెరాస్‌మెంట్స్ అనేవి చాలా కామన్ గా మనం మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈమద్య కాలంలో హీరోయిన్స్ మీటూ అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇటీవలే ఒక హీరోయిన్ ను యూఏఈకి చెందిన ఒక వ్యక్తి ఒక రాత్రికి తనతో గడపాలంటూ ఒత్తిడి చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయం మర్చి పోకముందే మరో సంఘటన జరిగింది.మలయాళ బుల్లి తెర వెండి తెర నటి గాయత్రి అరుణ్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపులను షేర్ చేసింది. రోహన్ అనే కుర్రాడు ఒక రాత్రికి తన కోరిక తీర్చమని అందుకోసం 2 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. ఈ విషయం మనిద్దరి మద్యే ఉంటుందని కూడా మెసేజ్ చేశాడు. ఒక్క గంటకు రెండు లక్షలు అంటూ ఆ వ్యక్తి చేసిన చాట్ ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దాంతో పాటు నేను ప్రతి రోజు మీ అమ్మ సోదరిల భద్రత గురించి దేవుడిని ప్రార్థిస్థాను అంటూ కూడా పోస్ట్ లో పేర్కొంది.

గాయత్రి అరుణ్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కుర్రాడు మైనర్ కాబట్టి లీగల్ గా చర్యలు తీసుకోలేదని వారి తల్లిదండ్రులు తనకు క్షమాపణలు చెప్పడం వల్ల తాను లీగల్ గా ప్రొసీడ్ కాలేదు అంది.