సినిమా పోయింది. డబ్బూ పోయింది.

Sat Aug 12 2017 10:27:29 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి హీరో బాక్స్ ఆఫీస్ పై కన్నేశాడు. కథ ప్రేక్షకుల వరకు వెళితే తప్పకుండా హిట్ కొట్టవచ్చని ఆలోచిస్తున్నారు. అయితే కొందరు మాస్ ఇమేజ్ ఉన్న  హీరోలు సినిమాల్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ స్థాయికి ఎదగలేకపోతున్నారు. అటువంటి వారిలో గోపీచంద్ ఒకరు. ఆయన తీసిన సినిమాలు బాగానే ఆడుతున్న ఇంకా ఇండస్ట్రీలో రికార్డులు కొల్లగొట్టే హీరోగా ఎదగలేకపోతున్నాడు. ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న ఆ హీరోకి సరైన కధ తగిలితే తప్పకుండా హిట్ కొట్టగలడని చెప్పవచ్చు.అయితే రీసెంట్ గా లాంటి నమ్మకం పెట్టుకొని "గౌతమ్ నంద"  సినిమాను ఒప్పుకున్నాడు గోపీచంద్ నటన పరంగా ఎన్నో ప్రయాగాలు చేసిన ఈ హీరో మొదటి సారి డ్యూయెల్ రోల్ లో మెరిశాడు. ఈ సినిమాను రిచ్ గా తీయడానికి నిర్మాతలు గోపీచంద్ మార్కెట్ ను మించి మరి ఖర్చుపెట్టారు కానీ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో కొంత లాస్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇక కమర్షియల్ సినిమాలను తీసే సంపత్ నంది తన దర్శకత్వంతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మీద నమ్మకం పెట్టుకొని బడ్జెట్ ఎక్కువవుతుండడంతో  ఈ దర్శకుడు హీరో గోపీచంద్ రెమ్యునరేషన్ ను కూడా పూర్తిగా తీసుకోలేదట. సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఆ తర్వాత మాట్లాడుకుందామని అనుకున్నారట.

కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టకపోవడంతో నిర్మాతలతో పాటు గోపి - సంపత్ కూడా లాస్ అయ్యారని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ గోపీచంద్ కెరీర్ లోనే మొట్ట మొదటీ సరిగా మొదటి వారం కలెక్షన్స్ 20 కోట్లు దాటాయని ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. కానీ గౌతమ్ నంద ఆ స్థాయిలో హిట్ కాలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక దాదాపు ఈ సినిమా కలెక్షన్స్ ఈ వారంలో క్లోజ్ అవుతాయనే తెలుస్తోంది. ఎందుకంటే రానా-నితిన్- బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకొని ముందుకు వెళుతున్నాయి.