Begin typing your search above and press return to search.

16 ఏళ్ళ తర్వాత సీక్వెల్

By:  Tupaki Desk   |   13 Feb 2019 8:32 AM GMT
16 ఏళ్ళ తర్వాత సీక్వెల్
X
పోలీస్ కథలంటే అరుపులు కేకలు సవాళ్లు అనే ఫార్ములాకు భిన్నంగా ఒక ట్రెండ్ ని సెట్ చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్. 2003లో సూర్య-జ్యోతికలతో తీసిన కాక కాక బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఇలాంటి సినిమాలకు కొత్త ఫార్ములాను రాసి ఇచ్చింది. దీన్ని విక్టరీ వెంకటేష్ హీరోగా ఆసిన్ హీరోయిన్ గా గౌతమే తెలుగులో రీమేక్ చేసాడు. ఆ స్థాయి విజయం కాదు కానీ తెలుగులో కూడా ఇది కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. రెండు వెర్షన్లకు కలైపులి థానునే నిర్మాత. దీన్ని ఫాలో అవుతూ తర్వాత చాలా పోలీస్ సినిమాలు వచ్చాయి కానీ కాక కాక రేంజ్ వేరు.

ఇన్నాళ్లకు దీని సీక్వెల్ కు ప్రయత్నాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. గౌతమ్ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం. వేరే కథ కాకుండా ఇన్నేళ్ల తర్వాత కాక కాకలోని పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనే పాయింట్ మీద ఎక్స్ టెండ్ చేసే విధంగా ఓ లైన్ చెప్పినట్టు టాక్. ఇందులో హీరోయిన్ జ్యోతికకు బదులు ఇంకొకరిని తీసుకోవచ్చు. కారణం ఫస్ట్ పార్ట్ లోనే తన పాత్ర చనిపోయింది కాబట్టి. తెలుగులో వెంకటేష్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఆసిన్ పాత్రను బ్రతికించారు.

కానీ అదే కొంత మేరకు ఫలితం మీద ప్రభావం చూపించిందని ఇప్పటికీ మాట్లాడుకుంటారు. సో సూర్య ఆ క్లాసిక్ కు సీక్వెల్ చేసే ఆలోచన అయితే ఉందన్న మాట. ప్రస్తుతం నంద గోపాల కృష్ణ-కాప్పన్ షూటింగ్ లతో బిజీగా ఉన్న సూర్య అవి పూర్తయ్యాక దీని గురించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విశాల్ తో ఓ మూవీ ప్లాన్ చేసిన గౌతమ్ అది అయ్యాక ఇది స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి తెలుగులో వెంకీ ఘర్షణ 2గా ఇది తీస్తాడో లేదో దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది