Begin typing your search above and press return to search.

బన్నీతో గౌతమ్ మీనన్ సెన్సేషనల్ మూవీ

By:  Tupaki Desk   |   13 Oct 2015 1:30 PM GMT
బన్నీతో గౌతమ్ మీనన్ సెన్సేషనల్ మూవీ
X
తమిళం - తెలుగు భాషల్లో వేర్వేరుగా హీరోల్ని పెట్టి ద్విభాషా చిత్రాలు చేయడం గౌతమ్ మీనన్ కు అలవాటు. ఏమాయ చేసావె - ఎటో వెళ్లిపోయింది మనసు - సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్ని అలాగే తీశాడు. ఇప్పుడతను ఒకేసారి నాలుగు భాషల్లో ఒకేసారి ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండటం విశేషం. ఈ మధ్యే ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీ షూటింగ్ పూర్తి చేసేశాడు గౌతమ్. దీని తర్వాత గౌతమ్ చేయబోయేది 4 భాషల సినిమానే.

విశేషం ఏంటంటే.. ఇందులో తెలుగులో అల్లు అర్జున్ కథానాయకుడిగా చేయబోతున్నాడు. తమిళంలో గౌతమ్ ఫేవరెట్ హీరో శింబునే హీరోగా నటిస్తాడు. ఏమాయ చేసావె - సాహసం శ్వాసగా.. సినిమాల తమిళ వెర్షన్లలో శింబునే కథానాయకుడన్న సంగతి తెలిసిందే. మిగతా రెండు భాషలు.. మళయాళం, కన్నడ.

కన్నడలో రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుంటే.. మళయాళం కోసం ఫాహద్ ఫాజిల్ ను ఎంచుకున్నాడు గౌతమ్. ఫాహద్.. సీనియర్ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు. నజ్రియా నజ్రీన్ భర్త కూడా. తమిళ - మళయాళ భాషల్లో ఈ సినిమాను గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మిస్తుండగా.. కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. తెలుగు వర్షన్ ఎవరు నిర్మిస్తారన్న సంగతి ఇంకా తేలలేదు. చరణ్ తో చేయాల్సిన సినిమాకు ముందే గౌతమ్ ఈ మూవీని పూర్తి చేయనున్నాడు. నాలుగు భాషల హీరోలతో ఒకేసారి వేర్వేరుగా సినిమా చేయడమంటే పెద్ద రిస్కే. మరి గౌతమ్ ఈ సినిమా ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.