Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మహేష్ భుజాలు దాటేస్తున్నాడు

By:  Tupaki Desk   |   18 July 2018 5:54 AM GMT
ఫోటో స్టోరీ: మహేష్ భుజాలు దాటేస్తున్నాడు
X
ఫ్యాన్స్ కి స్టార్ హీరోల మీద ఎంత అభిమానం ఉంటుందో అంతే ఫోకస్ వాళ్ళ పిల్లలపై కూడా కనిపిస్తుంది. అందుకే రాబోయే వారసుల గురించి సోషల్ మీడియా తెగ హల్చల్ చేస్తుంటారు. రామ్ చరణ్ ని తీసుకున్నా రాబోయే మోక్షజ్ఞను తీసుకున్నా వీళ్ళ బలం నాన్నలను ఇంతస్థాయికి తీసుకొచ్చిన అభిమానగణమే. ఇక మహేష్ బాబు లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోల గురించి చెప్పేదేముంది. మహేష్ వారసుడిగా గౌతమ్ ని ఇప్పటినుంచే చూసుకుంటున్న ఫాన్స్ కు తను స్క్రీన్ మీద ఎలా ఉంటాడో చిన్న సాంపిల్ రూపంలో వన్ నేనొక్కడినే ఆల్రెడీ చూసారు. నటన పరంగా కూడా నాన్నకు తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.

ఇక రోజులు గడిచే ఎదుగుదల ఉండటం సహజం కాబట్టి గౌతమ్ లో వస్తున్న మార్పులు అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అచ్చం నాన్న పోలికలు పుణికి పుచ్చుకుంటూనే హైట్ విషయంలో ఇప్పటికే మహేష్ భుజాలు దాటేసి మరో రెండేళ్లలో అంతకు మించి పొడుగయ్యేలా ఉన్నాడు. హీరో ఫీచర్స్ అప్పుడే కనిపించడం చూసి ఘట్టమనేని ఫాన్స్ ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా. నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకోవడం వల్ల ఇవన్నీ అభిమానులకు అందుతున్నాయి. ఇప్పుడు పోస్ట్ చేసిన పిక్ పారిస్ వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు తీసింది. మహేష్ ఇప్పుడు గౌతమ్ ఉన్న ఏజ్ లోనే బాలనటుడిగా అప్పట్లో ఎంట్రీ ఇచ్చాడు. నాన్న కృష్ణతో కలిసి శంఖారావం-కొడుకు దిద్దిన కాపురం-ముగ్గురు కొడుకులు-గూఢచారి 117 లాంటి ఎన్నో హిట్ మూవీస్ లో నటించాడు. చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ ఇప్పటి పరిస్థితి వేరు.అప్పుడు కృష్ణ గారిలా మహేష్ ఏడాదికి ఐదారు సినిమాలు చేసే పరిస్థితిలో లేడు. సో గౌతమ్ ని అప్పుడప్పుడు సినిమాల్లో చూపించాలన్నా కథ డిమాండ్ చేస్తే తప్ప వీలు కాదు. అప్పట్లో మహేష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా దృష్టిలో ఉంచుకునే కథలు రాసుకునేవారు. ఇప్పుడు అది సాధ్యం కాదు. అందుకే గౌతమ్ ఎంట్రీ కి ఎంత లేదన్నా మరో పదేళ్లు ఆగాల్సిందే. అప్పటికంతా చదువు పూర్తయిపోతుంది కాబట్టి మూడో తరం సూపర్ స్టార్ వారసుడిని తెరమీద చూడవచ్చు.