Begin typing your search above and press return to search.

ఫైన‌ల్ గా ఖైదీ.. శాత‌క‌ర్ణి లెక్కేంటి?

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:03 PM GMT
ఫైన‌ల్ గా ఖైదీ.. శాత‌క‌ర్ణి లెక్కేంటి?
X
మొత్తానికి సంక్రాంతి సినిమాల సంద‌డికి త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌బోతోంది. సంక్రాంతి సెల‌వుల్లో వ‌సూళ్ల పంట పండించుకున్న కొత్త సినిమాలు.. రెండో వీకెండ్లో కొత్త సినిమాలేవీ లేక‌పోవ‌డంతో మంచి క‌లెక్ష‌న్లే రాబ‌ట్టాయి. సంక్రాంతి రేసులోకి ఆల‌స్యంగా వ‌చ్చిన ‘శ‌త‌మానం భ‌వ‌తి.. మిగతా రెండు భారీ సినిమాల కంటే ముందు లాభాల బాట ప‌ట్టింది. ఐతే భారీ బ‌డ్జెట్.. భారీ బిజినెస్ జ‌ర‌గ‌డం వ‌ల్ల ‘ఖైదీ నెంబ‌ర్ 150’.. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ ఇంకా బ్రేక్ ఈవెన్ కు రాలేదు. ఐతే అది క‌ష్ట‌మైన విష‌య‌మేమీ కాదు. ఈ సినిమాల‌పై బ‌య్య‌ర్ల పెట్టుబ‌డి దాదాపుగా వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్లే కానీ.. ఎంత మేర‌కు లాభాలు అందిస్తాయ‌న్న‌దే సందేహంగా మారింది.

‘ఖైదీ నెంబ‌ర్ 150’ క‌లెక్ష‌న్లు రెండో వారంలోనూ బాగానే వ‌చ్చాయి. వీక్ డేస్ లో నెమ్మ‌దించినా.. రెండో వీకెండ్లో అనుకున్న దాని కంటే మెరుగైన క‌లెక్ష‌న్ ఫిగ‌ర్సే న‌మోద‌య్యాయి. దీంతో చిరు సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ 90 కోట్ల‌కు చేరువైంది. ఈ సినిమా హిట్ కేట‌గిరిలోకి చేరాలంటే రూ.92.5 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. అదేమంత క‌ష్టం కాకపోవ‌చ్చు. ఆల్రెడీ ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న నాన్‌-బాహుబ‌లి షేర్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టేసిన చిరు సినిమా ఫుల్ ర‌న్లో రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువ‌గా వెళ్లొచ్చేమో. ఐతే రూ.110 కోట్ల షేర్ సాధిస్తే త‌ప్ప ఈ చిత్రాన్ని సూప‌ర్ హిట్ కేట‌గిరిలో వేయ‌లేం.

ఇక ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ సంగ‌తి చూస్తే.. తొలి వారంతో పోలిస్తే రెండో వారంలో ఈ సినిమా వ‌సూళ్లు నెమ్మ‌దించాయి. ఓ ద‌శ‌లో రూ.50 కోట్ల షేర్ మార్కు సునాయాసంగా క‌నిపించింది కానీ.. రెండో వారం వ‌సూళ్లు చూస్తే అది అతి క‌ష్టం మీద సాధ్య‌మ‌య్యేలా ఉంది. ఈ చిత్రం రూ.50 కో్ట్ల మార్కును దాటితేనే హిట్ కేట‌గిరిలోకి వ‌స్తుంది. ఐతే ఫుల్ ర‌న్లో దాదాపుగా ఆ మార్కుకు చేరువ‌గా వ‌చ్చి.. బ్రేక్ ఈవెన్ తో బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/