చరిత్రకు బొట్టు పెట్టిన శ్రియ!!

Wed Jan 11 2017 18:00:08 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో.. నందమూరి అభిమానుల ఆనందం ఆకాశమే హద్దు అన్న స్థాయిలో ఉంది. బాలయ్య వందో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూసి పండుగ చేద్దామా అనుకుంటున్న అభిమానులకు.. థియేటర్ కి వెళ్లే ముందే మరెన్నో బహుమతులు అందిస్తోంది శాతకర్ణి యూనిట్.రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ప్రమోషన్స్ ను పీక్ స్టేజ్ కి చేర్చిన శాతకర్ణి టీం.. తాజాగా ఈ మూవీలోని ఓ డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. బాలయ్యకు బొట్టు పెడుతూ.. 'నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు.. ఓ చరిత్రకు' అంటూ శ్రియ చెప్పిన డైలాగ్ అదిరిపోయిందని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ లోను.. ప్రతీ సీన్ లోను.. ఆయా సన్నివేశాల్లో ఉండే ఇంటెన్సిటీని మరింతగా పెంచేందుకు డైలాగ్స్ విషయంలో.. శాతకర్ణి టీం ఎంతగా జాగ్రత్త పడిందో ఈ ఒక్క డైలాగ్ తో అర్ధమవుతుంది.

ఇక ఇదే టీజర్ లో యుద్ధానికి సన్నద్ధమైన బాలయ్య.. గుర్రంపై నుంచే సిద్ధమా అనడం.. సిద్ధం అంటూ సైన్యం బదులు ఇచ్చే సన్నివేశం కూడా రక్తం మరిగించేస్తుంది. చిన్నపాటి టీజర్ తో కూడా గౌతమిపుత్ర శాతకర్ణిపై అంచనాలు మరింతగా పెంచడంలో దర్శకుడు క్రిష్ సూపర్ సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/