శాతకర్ణి శకం ఇవాల్టి నుంచే ప్రారంభం

Thu Jan 12 2017 05:49:29 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఎన్నెన్నో కథలు చివరకు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఇవాళే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ చిత్రం.. కొత్త రికార్డులకు వేదిక కావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటివరకూ తెలుగు ప్రజలకు తెలియని ఓ మహావీరుని జీవిత చరిత్రను.. టాలీవుడ్ ప్రేక్షకులకు అందించేందుకు హీరో బాలకృష్ణ-దర్శకుడు క్రిష్ ఎంతో కష్టపడ్డారు. ఇప్పటివరకూ బాలయ్య పేరిట టాలీవుడ్ లో చాలా రికార్డులే ఉన్నాయి. వాటన్నిటినీ తన వందో  చిత్రంతో తుడిచిపెట్టేసేందుకు బాలయ్య సన్నద్ధమైపోయారు. ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఎంతో ఆసక్తి రేకెత్తించిన శాతకర్ణికి.. రిలీజ్ నాటికి హైప్ విపరీతంగా పెరిగిపోయింది. శాతకర్ణి శకం ఇవాల్టి నుంచే ప్రారంభిస్తున్నాడు బాలకృష్ణ.

ఇప్పుడు బాలయ్య తొలిరోజు రికార్డులపై బాలయ్య కన్నేశాడు. ఇప్పటివరకూ బాలకృష్ణ సినిమాలన్నిటి.. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులను శాతకర్ణి అధిగమించేయడం ఖాయం అని అంటున్నారు. గ్రాండ్ రిలీజ్ చేయనుండడం.. రెండు రాష్ట్రాల్లోనూ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లభించడంతో.. తొలి రోజు వసూళ్లను బాలయ్య కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.