Begin typing your search above and press return to search.

బాహుబలి ఫీట్.. శాతకర్ణి రిపీట్

By:  Tupaki Desk   |   27 Oct 2016 8:17 AM GMT
బాహుబలి ఫీట్.. శాతకర్ణి రిపీట్
X
ఒక సినిమా ఇంటర్వెల్లో మరో కొత్త సినిమా ట్రైలర్ ప్రదర్శించడం మామూలే. అలా కాకుండా ఒక ట్రైలర్నే ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించడం అన్నది ‘బాహుబలి’ విషయంలోనే జరిగింది. బహుశా ఇండియాలో మరే సినిమాకూ ఇలా జరిగి ఉండదేమో. ఇలాంటి ఫీట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా రిపీట్ చేయబోతోంది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కోసం కూడా ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లే చేస్తున్నారు. డిసెంబరు తొలి వారంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఒకేసారి వంద థియేటర్లలో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తారట. అందుకోసం బాలయ్య ఓ ప్రత్యేక ముహూర్తం చూస్తున్నారు.

‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రదర్శించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ని మాత్రం అమెరికా.. బ్రిటన్ సహా పలు దేశాల్లో ఒకే ముహూర్తానికి ప్రదర్శించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దసరా కానుకగా లాంచ్ చేసిన ‘శాతకర్ణి’ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే అందులో చాలా వరకు క్లోజప్ షాట్సే ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలు అంత ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించలేదు. ట్రైలర్లో మాత్రం లాంగ్ షాట్స్.. భారీ యుద్ధ సన్నివేశాల్ని శాంపిల్ గా చూపిస్తారని సమాచారం. ముందు ట్రైలర్ రిలీజ్ చేశాక.. డిసెంబరు మధ్యలో ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/