శాతకర్ణి మార్నింగ్ షో.. నెటిజన్ల స్పందన!

Thu Jan 12 2017 10:44:44 GMT+0530 (IST)

సామాజిక సందేశాలతో కూడిన వినూత్న సినిమాలు అందించే దర్శకుడిగా పేరొందిన క్రిష్ తన వందో సినిమా ఉత్సాహంలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి పాత్రలో బాలయ్య.. ఈ కాంబినేషన్ లో సంక్రాంతి బరిలోకి దిగిన చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి". ఈ సినిమా ప్రకటించిన నాటినుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికితోడు సినిమా ట్రైలర్ కూడా బాగుండటంతో ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్యకు సూపర్ హిట్ ఖాయమన్న అంచనాకు వచ్చేశారు అభిమానులు. అలాగే ఇండస్ట్రీ ఇంటర్నల్ టాక్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో ఇక వారి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ఈ క్రమంలో అంతా ఊహించినట్లుగానే ఇప్పటికే బెనిఫిట్ షో చూసినవారంతా "శాతకర్ణి సూపర్" అని ఆన్ లైన్ వేదికగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. చారిత్రాత్మక చిత్రం.. బాలయ్య మార్కు రాజసం దానికి తోడు తనదైన డైలాగ్ డెలివరీ.. క్రిష్ మార్కు డైరెక్షన్ ప్రతిభ.. దీంతో గౌతమీ పుత్ర శాతకర్ణిపై నెటిజన్లు పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా క్రిష్ టాలెంట్ తో పాటు యుద్ద సన్నివేశాలు బాలయ్య ఎమోషనల్ డైలాగ్స్ థియేటర్ ని ఒక ఊపు ఊపుతున్నాయని ట్విట్టర్ టాక్! ఇలా ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండటంతో చిత్రయూనిట్ సంతోషంలో మునిగిపోగా అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు!

ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించిన దగ్గుబాటి రానా... ఈ సినిమా గురించి అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయని చెబుతూ... తన ట్విట్టర్ ప్రొఫైల్ "లక్ష్మీపుత్ర రానా" అని మార్చి.. ఇది డైరెక్టర్ క్రిష్ కి తానిచ్చే గౌరవ అని తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/