అబ్బే.. నా కూతురు నటించడం లేదు

Tue Mar 13 2018 16:40:23 GMT+0530 (IST)

గౌతమి కూతురు సుబ్బులక్ష్మి కూడా సినిమాలలో తెరంగేట్రం ఇస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. గౌతమినే రెండేళ్లుగా కష్టపడి... ఓ పెద్ద సినిమాను కూతురు కోసం పట్టేసిందని కూడా అన్నారు. కానీ అదంతా ఉత్త గాలి వార్తలే అని తేలిపోయింది. గౌతమినే స్వయంగా తన కూతురు సినిమాలలో నటించడం లేదని చెప్పింది.గౌతమికి మొదటి భర్త వల్ల కలిగిన సంతానం సుబ్బులక్ష్మి. పెళ్లయిన ఏడాదికే ఆమె భర్తతో విడిపోయింది. అనంతరం కమల్ హాసన్‌తో సహజీవనం చేసింది. ఇప్పుడు ఆ బంధానికి కూడా బీటలు పడ్డాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం గౌతమి ప్రపంచం ఆమె కూతురే. ఆమె టాలీవుడ్ సూపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ సినిమాతో తెరంగేట్రం చేస్తోందని టాక్ వచ్చింది. దర్శకుడు బాల  వర్మ పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేస్తున్నాడు. ఇందులో విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గెడ్డంతో ఉన్న అతని ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే ఈ సినిమాకే సుబ్బులక్ష్మి ఎంపికైందని అన్నారు. షాలినీ పాండేలాగే ముద్దుసీన్లలో రెచ్చిపోయి నటిస్తుందా అన్న చర్చలు కూడా నడిచాయి. ఇదంతా గమనించిన గౌతమి తన ట్విట్టర్ ఖాతాలో క్లారిటీ ఇచ్చింది.

తన కూతురు దృష్టంతా ప్రస్తుతం చదువుమీదే ఉందని చెప్పింది.  ఇప్పట్లో సినిమాలు చేసే ఆలోచనలు లేవని చెప్పింది. దీంతో మరి వర్మ సినిమాలో హీరోయిన్ ఎవరో అన్న చర్చ మొదలైంది. సినిమా యూనిట్ కూడా ఇంతవరకు ఎవరినీ ప్రకటించలేదు. కాస్త బోల్డ్‌గా నటించే పిల్ల కోసం వెతుకుతున్నారో లేక ఎవరినైనా కొత్తగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారో మరి తెలియదు. అతి త్వరలో సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. హీరోయిన్ ఎంపిక ఎప్పుడు చేస్తారో మరి.