మెహబూబా విలన్ అతనే!!

Fri Oct 13 2017 18:00:18 GMT+0530 (IST)

ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన స్టార్ సీనియర్ డైరెక్టర్ పురిజగన్నాథ్ గత కొంత కాలంగా అపజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పూరి తన కొడుకుతో మంచి కథను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు పూరి చాలా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథలను లవ్ స్టోరీలను చూపించాడు. అయితే ఇప్పుడు ఆకాష్ తో తీయబోయే మొదటి సినిమాని కాస్త కొత్తగా తీయబోతున్నాడట.1971 ఇండో - పాక్ యుద్ధ నేపధ్యంలో మెహబూబా అని టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా హిమాచల్ లో సినిమా స్టార్ట్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమాలో కథలో కీలకం కానున్న నెగిటివ్ రోల్ కు గౌతమ్ అనే అనే యాక్టర్ ని ఎన్నుకున్నాడట. ఈ నటుడు మురగదాస్ - విజయ్ కాంబోలో వచ్చిన తుపాకీ సినిమాలో టెర్రరిస్టుగా నెగెటివ్ రోల్ చేసి చాలా ఆకట్టుకున్నాడు. అలాగే బాలకృష్ణ - డిక్టేటర్ సినిమాలో కూడా విలన్ పాత్రలో చాలా వరకు మెప్పించాడు.

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ - మెహబూబా లో కూడా కథను మలుపు తిప్పబోయే విలన్ గా అలరించడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం హిమాచల్ జరుగుతున్న మొదటి షెడ్యూల్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాడట ఈ నటుడు. మెహబూబా నెక్స్ట్ షెడ్యూల్ పంజాబ్ - రాజస్థాన్ లో జరగనుంది. పురిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  హీరోయిన్ గా కన్నడ భామ నేహా శెట్టి నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్నారు.