Begin typing your search above and press return to search.

బాహుబలిని చూసి వాతలు ఏల!!!

By:  Tupaki Desk   |   6 Feb 2016 4:02 AM GMT
బాహుబలిని చూసి వాతలు ఏల!!!
X
సినిమాలతోనే కాదు.. మూవీ ప్రమోషన్ లో కూడా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ట్రెండ్ సృష్టించేస్తుంటాడు. బాహుబలి మూవీని గతేడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తానని చెప్పిన జక్కన్న.. అది లేట్ అయ్యేసరికి.. కొన్నాళ్లపాటు ఒక్కో కేరక్టర్ ని పరిచయం చేశాడు. ఇది ఫ్యాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ జనరేట్ కావడానికి కారణం అయింది. అసలు ఇలా కేరక్టర్ ఇంట్రడక్షన్ ని అంతకు ముందే సన్నాఫ్ సత్యమూర్తి కోసం త్రివిక్రమ్ స్టార్ట్ చేసినా.. బాహుబలి పాత్రలకు వచ్చినంత గుర్తింపు రాలేదు.

ఇప్పుడు అదే పద్ధతిని మరిన్ని సినిమాలు ఫాలో అయిపోతున్నాయి. ఆది - ఆదాశర్మ జంటగా వస్తున్న గరం మూవీ కోసం కూడా ఒకో పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్స్ వేస్తున్నారు. లేటెస్ట్ ఫోటో ఏంటంటే సెవెన్ డేస్ టు గో అంటూ.. తాగుబోతు రమేష్ యాజ్ గ్రాఫిట్ ఆర్టిస్ట్ అంట. గత నెలలో వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజాకు కూడా సేమ్ ఇదే థీమ్ ఫాలో అయిపోయారు. బాహుబలిని చూసి ఇన్ స్పైర్ అయ్యుంటారు అనుకోవచ్చు కానీ.. ఇక్కడ ఓ విషయం అర్ధంకానిది ఉంది.

బాహుబలికి రాజమౌళి క్యారెక్టర్లను పరిచయం చేశాడంటే.. ఆ మూవీలో యాక్టర్ల కంటే పాత్రలకే ప్రాధాన్యం ఎక్కువ. ఆ రోల్స్ అలా స్టాంప్ పడిపోతాయ్. కానీ ఈ సినిమాలను చూస్తే.. మొత్తం హీరోనే ఉంటాడు.. ఈ క్యారెక్టర్లేమీ పెద్దగా కనిపించవ్‌. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే తప్ప.. గుర్తుంచుకునే రోల్ ఒకటి కూడా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి బాహుబలి టైపు ప్రమోషన్‌ చేసినంత మాత్రా ఉపయోగం ఏంటో అర్ధం కాని విషయమే కదా.