Begin typing your search above and press return to search.

బ్రేక్ ఈవెన్ కి ద‌గ్గ‌ర‌లో గ్యాంగ్

By:  Tupaki Desk   |   16 Sep 2019 9:21 AM GMT
బ్రేక్ ఈవెన్ కి ద‌గ్గ‌ర‌లో గ్యాంగ్
X
ఊహించ‌నిదేదో జ‌రిగితేనే హిట్ట‌వుతుంది అనుకున్న‌వాల్ల‌కు ఊహించ‌ని ఫ‌లిత‌మే ఇది. విక్ర‌మ్.కె కుమార్ వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో అస‌లు నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ హిట్ట‌వుతుందా? క్లాస్ వ‌ర‌కూ చేరే సినిమా ఇది అంటూ టీజ‌ర్ - ట్రైల‌ర్ టైమ్ లో కామెంట్లు వినిపించాయి. అయితే ఊహించ‌ని రీతిలోనే ఈ సినిమా తొలి వీకెండ్ రిపోర్ట్ అందడం.. అది కాస్తా బ్రేక్ ఈవెన్ కి స‌మీపంలో ఉండ‌డం చూస్తుంటే.. నానీ హ‌వా మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుటైంద‌నే అర్థ‌మ‌వుతోంది.

విక్ర‌మ్.కె.కుమార్ మార్క్ లాజిక్కులేవీ లేకుండా తొలిసారి ఎంతో ఫ్లాట్ నేరేష‌న్ తో తీసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుండ‌డం విశ్లేష‌కులే నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది. స‌మీక్ష‌ల్లో ఏ పాయింట్ల‌ను వేలెత్తి చూపించారో అవే ప్ల‌స్ అయ్యాయా? అన్న చ‌ర్చా సాగుతోంది. ముఖ్యంగా నానీతో పాటు లేడీ గ్యాంగ్ .. అందులో కిడ్ ఈ హంగుల‌న్నీ చూసి ఫ్యామిలీ ఆడియెన్ ముందే సినిమా చూసేయాల‌ని ఫిక్స‌వ్వ‌డం కూడా క‌లిసొస్తోందా అంటూ విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ తొలి వీకెండ్ నాటికే బ్రేక్ ఈవెన్ చేరువ కావ‌డం క‌ష్టం కాదు! అన్న రిపోర్ట్ తో మైత్రి సంస్థ‌లోనూ ఆనందం వెల్లి విరుస్తోంద‌ట‌. మొద‌టి మూడు రోజుల వసూళ్లు చూస్తే.. నైజాం - 4.67 కోట్లు వ‌సూలైంది. అక్క‌డ 7.60 కోట్ల బిజినెస్ చేసింది కాబ‌ట్టి బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మేమీ కాద‌న్న మాట వినిపిస్తోంది. సీడెడ్-1.43 ..(3.60 బిజినెస్).. ఉత్తరాంధ్ర-1.57 (2.50).. తూ.గో జిల్లా -1.06 (1.60).. ప‌.గో జిల్లా-0.64 (1.20) .... కృష్ణ-0.94 (1.45).. గుంటూరు-1.10 (1.80).. నెల్లూరు- 35 ల‌క్ష‌లు (0.75) వ‌సూలైంది. చాలా చోట్ల స‌గం పైగా వసూళ్ల రూపంలో వెన‌క్కి వ‌చ్చేయ‌డంతో హ్యాపీ మూవ్ మెంట్ క‌నిపిస్తోంది. అలాగే అమెరికా నుంచి చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కాయ‌న్న రిపోర్ట్ అందింది. సెప్టెంబ‌ర్ 20న వాల్మీకి - బందోబ‌స్త్ లాంటి చిత్రాలు వ‌స్తున్నా నానీ సినిమా అప్ప‌టికే చాలావ‌ర‌కూ సేఫ్ అవుతుంద‌నే భావిస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల నుంచి వారంలోపే చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో బ్రేక్ ఈవెన్ ఫుల్ ఫిల్ చేసేస్తుందా అన్న‌ది చూడాలి.