Begin typing your search above and press return to search.

డీజే కోసం గణేష్ ని దించేశారు!!

By:  Tupaki Desk   |   21 March 2017 6:36 PM GMT
డీజే కోసం గణేష్ ని దించేశారు!!
X
డీజే-దువ్వాడ జగన్నాధం మూవీతో తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయాడు అల్లు అర్జున్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజే కోసం.. అన్ని రకాల అదనపు హంగులను ఏర్పాటు చేసేసుకుంటున్నాడు. ఈ మూవీ కోసం ఓ పాటను దుబాయ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే దుబాయ్ లో సాంగ్ షూట్ పూర్తయిపోగా.. ఈ పాటకు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. స్టైలిష్ స్టార్ తో పాటు పూజా హెగ్డే చిందులు వేసిన ఈ పాటకు.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను తీసుకొచ్చారట. గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన స్టెప్స్.. ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. సాంగ్ అద్భుతంగా వచ్చిందని.. గ్రాండ్ విజువల్స్ తో పాటు.. హీరో డ్యాన్సులు.. హీరోయిన్ అందాలు ఈ పాటకు అదనపు శోభను అద్దనున్నాయని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ కోసం ఇద్దరమ్మాయిలతో మూవీలో గణపతిబప్పా మోరియా సాంగును కూడా గణేషే కంపోజ్ చేశాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన డీజే టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న డీజే మూవీలో.. బన్నీ ఓ బ్రాహ్మిన్ లుక్ లో కనిపించనుండగా.. మరో కీలకమైన లుక్ ను ఇంకా రివీల్ చేయలేదు. డీజే-దువ్వాడ జగన్నాధంకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్.. కెమేరా డిపార్ట్ మెంట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/