హీరో హీరోయిన్ లిఫ్ట్ రొమాన్స్ వీడియో లీక్

Sat Jul 20 2019 10:19:15 GMT+0530 (IST)

ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ ల జోరు మామూలుగా లేదు. ఒకటి సక్సెస్ అయితే వాటికి సీక్వెల్స్ అంటూ వరుసగా వస్తున్నాయి. మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్ సిరీస్ లు గత కొంత కాలంగా ఇండియాలో కూడా ఎక్కువ అవుతున్నాయి. వెబ్ సిరీస్ లను కూడా సినిమాల స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. సెన్సార్ దాటి రావాలంటే కొన్ని కండీషన్స్ తో సినిమాను చేయాల్సి ఉంటుంది. అదే వెబ్ సిరీస్ లకు అలాంటివి ఏమీ ఉండవు. కనుక స్టార్స్ ఎంతో మంది వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.భవిష్యత్తులో సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే అధిక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. గత ఏడాది వచ్చిన 'గంధీ బాత్' వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో దానికి సీజన్ 2 కూడా రూపొందించారు. హాట్ రొమాంటిక్ గా సాగే ఆ వెబ్ సిరీస్ కు తాజాగా మూడవ సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. మొదటి రెండు సీజన్ ల కంటే మూడవ సీజన్ లో మరింత రొమాన్స్ ను జోడిస్తున్నట్లుగా తాజాగా లీక్ అయిన ఒక వీడియోతో వెళ్లడయ్యింది.

మూడవ సీజన్ కు సంబంధించిన ఒక రొమాంటిక్ సీన్ ను లిఫ్ట్ లో చిత్రీకరించారు. అది కావాలని మేకర్స్ లీక్ చేశారో లేదంటే ఎలా బయటకు వచ్చిందో కాని అది యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరీ శృతిమించిన రొమాన్స్ ఉంటుందని 'గంధీ బాత్ 3' పై అంచనాలు పెంచేశారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో తెలుగు వారికి సుపరిచితురాలైన ఆశా షైనీ(ఫ్లోరా షైనీ) నటించింది. ఆమె ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఒక లెస్బియన్ తో కూడా రొమాన్స్ చేసే సీన్స్ గంధీ బాత్ కు హైప్ ను తీసుకు వచ్చాయి. వీడియో లీక్ తో మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.