Begin typing your search above and press return to search.

ఒక డ్రాగన్ చచ్చిపోతుంది తెలుసా!!

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:40 PM GMT
ఒక డ్రాగన్ చచ్చిపోతుంది తెలుసా!!
X
ప్రపంచం అంతా ప్రతీ సంవత్సరం ఓ రెండు నెలలపాటు గేమ్ ఆప్ థ్రోన్స్ అనే సీరియల్ ప్రభావం నడుస్తూ ఉంటుంది. గత ఆరేళ్ళ నుండి ఇదే వరుస. ఇప్పుడు 7వ సంవత్సరంలో.. ఈ సీజన్ 7వ సీజన్లో ఓ ఐదు ఎపిసోడ్లు ఆల్రెడీ ప్రసారం అయ్యాయి. ఇప్పటికే ఈ సీరియల్ లో వచ్చినన్ని ట్విస్టులు ఇంకెక్కడా ఏ సినిమా లవ్వర్ కూడా చూసి ఉండడు. అయితే ఇప్పుడు రాబోయే ఒక ట్విస్టు లీకవ్వడంతో అభిమానులు హర్టవుతున్నారు.

ఇంకా ఈ సంవత్సరానికి 6వ ఎపిసోడ్ ప్రసారం కాలేదు కాని.. అప్పుడే ఈ 7వ ఎపిసోడ్ ను పొరపాటున HBO స్పెయిన్ ఎయిర్ చేసేసింది. ఆ దెబ్బతో ఈ సీజన్లోని సీక్రెట్లు కొన్ని ఔట్ అయిపోయాయి. ఇప్పటివరకు కలేసి అనే ఒక రాణి దగ్గర ఉన్న మూడు డ్రాగన్లతో ఆమె మొత్తంగా ఏడు రాజ్యాలనూ పాలిస్తుంది అని అందరూ అనుకున్నారు. కాని విషయం ఏంటంటే.. నార్త్ రాజ్యానికి రాజు అయిన జాన్ స్నో ను కాపాడ్డానికి ఆమె తన డ్రాగన్ ను పంపించగా.. ఆ డ్రాగన్ నైట్ వాకర్స్ తో జరిగిన యుద్దంలో చచ్చిపోతుంది. ఆ డ్రాగన్ ను బ్రతికించి ఇప్పుడు నైట్ వాకర్స్ తమ సైన్యంలో చేర్చుకుంటారు. ఆ విధంగా ఒక మంచి డ్రాగన్ చచ్చిపోయి అలా శత్రువులతో చేరిపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆ ఎపిసోడ్ చూసినోళ్ళు ఇలా జరిగిందేంటి అంటూ దిగులు చెందితే.. ఆ ఎపిసోడ్ చూడనోళ్ళు ఇప్పటి నుండే బాధపడుతూ ఆ ఎపిసోడ్ కోసం కర్చీఫ్ పక్కన పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వచ్చే ఆదివారం కాకుండా ఆ పై ఆదివారం ఈ ఎపిసోడ్ వస్తుందట. అది సంగతి.