Begin typing your search above and press return to search.

గద్దలకొండ గణేష్.. ఊపు తగ్గలే!

By:  Tupaki Desk   |   22 Sep 2019 12:09 PM GMT
గద్దలకొండ గణేష్.. ఊపు తగ్గలే!
X
హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మాస్ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ఈ సినిమా మొదటి రోజు ఐదున్నర కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక రెండవ రోజు కూడా 'గద్దలకొండ గణేష్' హవా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగింది.

తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు దాదాపు రూ. 3.5 కోట్ల షేర్ సాధించింది. మొదటిరోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ తగ్గినా ఇది సాధారణంగా కనిపించే తగ్గుదలే. ఓవరాల్ గా సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడగా ఉన్నట్టే. 'గ్యాంగ్ లీడర్' హవా తగ్గడం.. పోటీలో విడుదలైన 'బందోబస్త్' కు నెగెటివ్ టాక్ రావడం వరుణ్ తేజ్ సినిమాకు ప్లస్ అయ్యే అంశాలే. అయితే సోమవారం రోజు కలెక్షన్స్ బట్టే ఈ సినిమా లాంగ్ టర్మ్ లో ఎలా కలెక్షన్స్ నమోదు చేస్తుందనే సంగతి తెలుస్తుంది.

మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే అంశాలు ఉండడంతో ఈ సినిమాకు బీ సీ సెంటర్లలో స్పందన భారీగా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. వరుణ్ తేజ్ మాస్ మేకోవర్.. పూజ హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయని... వాటికి తోడు హరీష్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించాయనే టాక్ వినిపిస్తోంది.