Begin typing your search above and press return to search.

కుర్ర మ్యూజిక్ డైరక్టర్ బాగా సెట్‌ చేశాడు

By:  Tupaki Desk   |   26 May 2016 5:30 PM GMT
కుర్ర మ్యూజిక్ డైరక్టర్ బాగా సెట్‌ చేశాడు
X
కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌ జివి ప్రకాష్‌ అప్పుడే 50+ సినిమాలు చేశాడంటే అతగాడి రేంజ్ ఏంటో చూసుకోండి. కంపోజర్ గా మొన్ననే విజయ్‌ 'తెరి' సినిమాతో మరోసారి ఇరగదీశాడు అనిపించుకున్నాడు. ఇకపోతే హీరోగా కూడా అలరిస్తున్నాడు జివి. 'పెన్సిల్‌' సినిమా తరువాత ఇప్పుడు 'నాకు ఇంకో పేరుంది' అనే సినిమాతో రాబోతున్నాడు.

మ్యాటర్ ఏంటంటే.. మొన్నామధ్యన టైమ్స్ ఆఫ్‌ ఇండియా పేపర్ ను తిట్టిపోశాడు జివి. ''నాతో మాట్లాడినప్పుడు హీరో విజయ్ మోస్ట్ డిజైరబుల్‌ పోల్ లో నెం.1 గా వచ్చాడని చెప్పి.. ఇప్పుడేమో వేరే హీరోను డిక్లేర్‌ చేశారేంటి??'' అంటూ ట్విట్టర్ లో ప్రశ్నలు సంధించాడు. అసలు విజయ్‌ కోసం ఈ రేంజులో సపోర్టు ఇచ్చాడేంటబ్బా అనుకున్నారందరు. ''సదరు పేపర్ వారు ట్వీట్లు తీసేయమని కోరుతున్నారు'' అని కూడా చెప్పాడు. అసలు విషయం ఏంటంటే.. మనోడు ''నాకు ఇంకో పేరుంది'' సినిమాలో హీరో విజయ్‌ ఫ్యాన్ గా నటిస్తున్నాడు. మరి ఆ సినిమాను ప్రమోట్‌ చేయడానికి ఇలాంటి ఫీట్లన్నీ చేస్తున్నాడా?

ఏదేమైనా కోట్లలో ఉన్న విజయ్ అభిమానులు మాత్రం.. జివి మాంచి పని చేశాడంటూ.. ఇతగాడి కొత్త సినిమా కోసం ఆతృతగా వెయిటింగ్‌ అక్కడ. భలే సెట్‌ చేసుకున్నావ్‌ జీవి. అచ్చం మా నితిన్‌ ను గుర్తుకుతెచ్చావ్!!