Begin typing your search above and press return to search.

వెంకీ తరహా పాత్రలో సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   15 May 2019 7:03 AM GMT
వెంకీ తరహా పాత్రలో సూపర్ స్టార్
X
ఆ మధ్య వచ్చిన వెంకటేష్ ఘర్షణ గుర్తుందిగా. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా డిసిపి రామచంద్ర పాత్రలో వెంకీ చెలరేగిపోయిన తీరుకు మంచి రిజల్ట్ దక్కి కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ అభిమానులు దాన్నో స్పెషల్ మూవీగా భావిస్తారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే రజనికాంత్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా దర్బార్ లో హీరో పాత్ర ఇదే తరహలో ఉంటుందట.

ముంబై బ్యాక్ డ్రాప్ లో రౌడీలు గూండాలు గ్యాంగ్ స్టర్లు ఎక్కడ కనిపించినా ముందు వెనుకా ఆలోచించకుండా కాల్చిపారేసే పాత్రలో రజని విశ్వరూపం ఓ రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే ఘర్షణలో వెంకటేష్ చేసింది సింగల్ రోల్ అయితే ఇందులో రజనికాంత్ రెండు పాత్రలు చేస్తున్నాడు దీనికి సంబంధించిన ఈ అప్ డేట్ కి అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది. గత కొన్నేళ్ళుగా తన స్టైల్ మాస్ హిట్టు కొట్టి చాలా ఏళ్ళైన రజనికి తమిళ్ లో పేట మంచి ఫలితాన్ని ఇచ్చినా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది.

అందుకే అది రిపీట్ కాకుండా మనవాళ్ళకూ నచ్చేలా మురుగదాస్ అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్త వహిస్తున్నడట. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అనిరుద్ రవిచందర్ సంగీతం మరో ఆకర్షణ. దీపావళి విడుదలను టార్గెట్ చేసి షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు. ఒక పాత్రకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది కాని ఆ రెండో రోల్ ఎలా ఉంటుందో ఇంకొద్ది రోజులయ్యాక తెలుస్తుంది