Begin typing your search above and press return to search.

స్పెషల్‌ స్టోరి: దోస్త్‌ మేరా దోస్త్‌

By:  Tupaki Desk   |   2 Aug 2015 5:47 AM GMT
స్పెషల్‌ స్టోరి: దోస్త్‌ మేరా దోస్త్‌
X
స్నేహమేరా జీవితం .. స్నేహమేరా శాశ్వతం .. దోస్త్‌ మేరా దోస్త్‌.. తూహీ మేరా జాన్‌.. స్నేహం లేనిదే ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. ఇలాంటి పంచ్‌ లైన్స్‌ వెండితెర పై రెగ్యులర్‌ గా వినిపించేవే. ఈ లైన్స్‌ అటు సంభాషణల్లో, ఇటు లిరిక్స్‌ లో బాగా పాపులర్‌ అయ్యాయి. అయితే ఈ రేంజులో స్నేహం సినీపరిశ్రమలో ఎవరెవరి మధ్య ఉంది? అని పరిశీలిస్తే కొన్ని ఎగ్జాంపుల్స్‌ దొరికాయి.

కొణిదెల వారి పిల్లాడు రామ్‌ చరణ్‌ కి దగ్గుబాటి వారి కుర్రాడు రానాకి మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. చెన్నయ్‌ లో చదువుకున్నప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. సెలబ్రిటీ వారసులు అనే విషయాన్ని పక్కనబెట్టి ప్రతి విషయాన్ని ఈ ఇద్దరూ షేర్‌ చేసుకుంటారని చెబుతుంటారు. ఈ ఇద్దరి తో అంతే సన్నిహితంగా ఉండేది శర్వానంద్‌. ఈ ముగ్గురు కలిసి పార్టీలు చేసుకుంటుంటారు.

అలాగే అందాల నాయిక సమంతకి, ఫ్యాషన్‌ డిజైనర్‌ కోన నీరజకు మధ్య అనుబంధం ఇటీవలి కాలంలో విస్త్రతంగా పాపులర్‌ అయ్యింది. నీరజ లేని సమంతని, సమంత లేని నీరజను ఊహించుకోలేం. క్లబ్బు, పబ్బు, ర్యాంపు, ఆన్‌ సెట్స్‌ .. ఎక్కడైనా ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ కలిసి విదేశాల్లో శికార్లు కూడా చేసొచ్చారు. అంతటి చనువు ఇద్దరిమధ్యా ఉంది.

లక్ష్మీ మంచు -తాప్సీ మధ్య స్నేహం ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. అసలు తాప్సీని మనోజ్‌ కి నాయికగా ఎంపిక చేసిందే లక్ష్మీ మంచు. నాటి నుంచి ఇద్దరి మధ్యా స్నేహం వేళ్లూనుకుంది. ఆ స్నేహంతోనే గుండెల్లో గోదారి చిత్రంలో తాప్సీ ఓ రేంజులో రెచ్చిపోయి నటించింది. మధ్యలో కొన్ని కలతలొచ్చాయని ప్రచారమైనా అవన్నీ ఉత్తుత్తే అని ఇద్దరూ జాయింటుగా చెప్పారు.

దర్శకుల్లో శ్రీనువైట్ల -వి.వి.వినాయక్‌ మధ్య స్నేహాన్ని ఫిలింసర్కిల్స్‌ లో ప్రత్యేకంగా ప్రస్థావిస్తుంటారు. ఈ ఇద్దరూ కెరీర్‌ ని పేరలల్‌ గానే నడిపించారు. ఆ క్రమంలోనే స్క్రిప్టు డిష్కసన్స్‌ నుంచి ఇతర వ్యక్తిగత విషయాల వరకూ ప్రతిదీ కలిసి షేర్‌ చేసుకుంటారని సన్నిహితులు చెబుతుంటారు.

నవతరం హీరోల్లో అల్లరి నరేష్‌-మనోజ్‌ -నాని చాలా స్నేహంగా ఉంటారు. కలిసే ఏ వేడుకలకు అయినా వెళుతుంటారు. అంతేనా ఒకరి పెళ్లిలో ఒకరు తెగ అల్లరల్లరి చేసేసుకున్నారు నరేష్‌, మనోజ్‌. నాని ఈ ఇద్దరితో ఎంతో చనువుగా ఉంటాడు. ఈ ముగ్గురూ ఓ చోట కలిస్తే రసాభాసే, రభస రభసే. జోకులే జోకులు. తూటాల్లా పేలిపోయేంత స్నేహం ఈ కుర్రాళ్లది.

మందు కొట్టే సన్నివేశం నుంచి విందు, చిందు ప్రతి విషయంలోనూ ఉన్న స్నేహం ఒకరి కష్టాల్లో ఒకరు వేరొకరిని ఆదుకునే రేంజులో ఉందనే భావిద్దాం. ఈ స్నేహం సాగనీ .. ఇలాగే... అనంతంగా...