రవితేజకు ఫోర్స్ చూపిస్తున్న విలన్

Fri Apr 21 2017 13:43:40 GMT+0530 (IST)

రవితేజ హీరోగా సినిమాలు చకచకా రెడీ అయిపోతున్నాయి. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు అనే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు మాస్ మహరాజ్. ఈ మూవీ కోసం బాలీవుడ్ యంగ్ విలన్ ఫ్రెడ్డీ దారువాలాను తీసుకొచ్చాస్తున్నాడు దర్శకుడు విక్రమ్ సిరికొండ.

2014లో వచ్చిన హాలిడే మూవీలో అక్షయ్ కుమార్ కి పోటీగా నటించిన ప్రెడ్డీ.. రీసెంట్ గా కమాండో2.. ఫోర్స్2 చిత్రాలతో అళరించాడు. ఇప్పుడు టాలీవుడ్ అరంగేంట్రంపై మహా ఉత్సాహంగా ఉన్నాడీ విలన్ పాత్రధారి. 'పూర్తిగా అవినీతితో నిండిపోయిన ఓ కేరక్టర్ ని చేస్తున్నాను. భూతద్దం పెట్టి వెతికినా మంచితనం అనేది ఎక్కడా కనిపించని రోల్ ఇది. పెర్ఫామెన్స్ బోలెడంత స్కోప్ ఉన్న పాత్ర ఇది. నిజానికి సౌత్ లో నెగిటివ్ కేరక్టర్స్ ను చాలా స్ట్రాంగ్ గా రూపొందిస్తారు. మూవీలో హీరో రవితేజ నన్ను పట్టుకునేందుకే కష్టపడాల్సి ఉంటుంది. మేమిద్దరం ఎదురెదురు పడే సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయి' అంటున్నాడు ఫ్రెడ్డీ దారువాలా.

'సౌత్ సినిమాలకు నేను అభిమానిని. చిరంజీవి.. నాగార్జున.. మహేష్ బాబు.. రవితేజ సినిమాలతోపాటు అనేక తెలుగు మూవీస్ కు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ చూశాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాను. ఇప్పటికే క్రాష్ కోర్సులో కూడా చేరా' అంటున్నాడు టచ్ చేసి చూడు విలన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/