Begin typing your search above and press return to search.

వింక్ గర్ల్ పాట యూట్యూబ్ లో మోత

By:  Tupaki Desk   |   21 Sep 2018 11:31 AM GMT
వింక్ గర్ల్ పాట యూట్యూబ్ లో మోత
X
ప్రియా వారియర్ పేరు చెప్పగానే 'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమా.. అందులో మాణిక్య మలరాయ పూవి పాట.. ఆ పాటలో అలా కన్నుగీటడం.. ఆ తర్వాత సోషల్ లో సెన్సేషన్ కావడం అన్నీ విషయాలు గుర్తొస్తాయి. తాజాగా అదే సినిమా నుంచి 'ఫ్రీక్ పెణ్ణే' అంటూ సాగే మరో పాటను ఫిలిం మేకర్స్ విడుదల చేశారు.

ర్యాప్ స్టైల్ లో సాగే ఈ మలయాళం పాట ఇప్పటికే సోషల్ మీడియాలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రిలీజ్ అయ్యి రెండు రోజులు కూడా గడవక ముందే ఈ పాటకు 2.3 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. పాటలో ప్రియా వారియర్ తో పాటు రోషన్ అబ్దుల్.. మరో హీరోయిన్ నోరిన్ షెరీఫ్ కూడా ఉన్నారు. ఫాస్ట్ ర్యాప్ బీట్ కు తగ్గట్టే కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఇక ప్రియా కూడా మంచి స్టెప్స్ వేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ కొంతమందికి మాత్రం ఈ పాట.. అందులో ప్రియా వారియర్ లుక్స్ నచ్చలేదు. దీంతో ఈ పాటకు డిస్ లైక్స్ కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. దాదాపు మూడు లక్షల మంది ఈ పాటకు డిస్ లైక్ కొట్టడం గమనించాల్సిన విషయం. అంతే కాదు ప్రియా లూక్స్ సరిగాలేవని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. మరి మీరు లైక్స్ కొడతారా.. లేదా డిస్ లైక్స్ కొడతారా? ఆ గట్టునుంటారా లేదా ఈ గట్టుకొస్తారా... అది తెలియాలంటే పాట చూడాలి కదా. చూడండి!