రెండు నెలలు.. నాలుగు సినిమాలు..

Fri Oct 20 2017 23:03:45 GMT+0530 (IST)

పండగ వచ్చిందంటే చాలు మిగతా సినిమా ఇండస్ట్రీలలో వాతావరణం ఎలా ఉంటుందో గాని మన టాలీవుడ్ లో మాత్రం సందడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే సంబరాల డోస్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. జనవరి సంక్రాంతికి మొదలుకొని డిసెంబర్ క్రిస్మస్ వరకు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసేస్తారు.అయితే ఈ ఇయర్ టాలీవుడ్ కి చాలా బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.  బాహుబలి హిట్ తో టాలీవుడ్ మార్కెట్ స్థాయి చాలా పెరిగిపోయింది. చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి ఏ స్థాయిలో చరిత్రను సృష్టించాడో తెలిసిన విషయమే. ఫిదా కూడా మరో మంచి చిత్రంగా ఈ ఇయర్ లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2017 ఇయర్ ఎండ్ అవ్వడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే టైమ్ ఉంది. అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రెండు నెలల్లో కరెక్ట్ గా చెప్పాలంటే నాలుగు మినిమమ్ హీరోల సినిమాలు మాత్రమే ఉన్నాయి.  

రామ్ - ఉన్నది ఒకటే జిందగి ఈ నెల 27న రిలీజ్ అవుతోంది. నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల సినిమా తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక నవంబర్ లో స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు. అయితే డబ్బింగ్ సినిమాలు లేక చిన్న చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత నెల డిసెంబర్ 21న న్యాచురల్ స్టార్ నాని మిడిల్ క్లాస్ అబ్బాయి గా రాబోతున్నాడు. అఖిల్ సెకండ్ మూవీ హలో 22న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గౌతమ్ నంద సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న గోపిచంద్ ఈ సారి హిట్ అందుకుంటాడా అనేది సందేహంగానే ఉంది. ఈ ఏడాది చివరగా డిసెంబర్ 29న గోపి ఆక్సిజన్ రిలీజ్ కానుంది. మరి ఈ నలుగురి హీరోల్లో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.