10 కోట్లకు తగ్గనంటున్న ఫ్లాప్ డైరెక్టర్ ?

Mon Jun 24 2019 13:33:16 GMT+0530 (IST)

పరిశ్రమలో ఎవరి కెరీర్ నైనా శాశించేది సక్సెసే. అది ఉన్నంత కాలం అందరూ చుట్టూ ఉంటారు ఎంత డిమాండ్ చేసినా కిమ్మనకుండా సమర్పించుకుంటారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ పలకరిస్తుందో మార్కెట్ లో డౌన్ అవుతున్న ఇమేజ్ వెక్కిరిస్తూ ఉంటుంది. ఇది హీరోలకు దర్శకులకు అందరికి వర్తిస్తుంది. కానీ సంక్రాంతికి భారీ డిజాస్టర్ ఇచ్చిన ఓ డైరెక్టర్ మాత్రం పారితోషికం విషయం తగ్గేది లేదని తెగేసి చెబుతున్నాడట.పిలిచి మరీ ఓ స్టార్ యూత్ హీరో అవకాశం ఇస్తే ఓ నాసి రకం మాస్ మసాలా సినిమా తీసి ఇవ్వడంతో ఏకంగా సదరు హీరో అందరికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్ రిలీజ్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఎవరికి జరగని అవమానం అది. ఇది పక్కన పెడితే ఈ దర్శకుడికి వేరే సీనియర్ స్టార్ ఆఫర్ కూడా ఉంది. పైన ఫలితం చూసాక మళ్ళి చూద్దాం లెమ్మని మరో తమిళ దర్శకుడికి ఆఫర్ ఇచ్చేశాడు. దీంతో ఇది కూడా పెండింగ్ లో పడిపోయింది.

ఫ్లాపులు ఎవరికైనా సహజమే కదా అని కొందరు నిర్మాతలు ఇతని దగ్గరకు  వస్తుంటే బడ్జెట్ 70 కోట్ల దాకా చెప్పి ముందే భయపెడుతున్నాడట. ట్విస్ట్ ఏంటంటే అందులో ఆయన రెమ్యునరేషనే 10 కోట్లట. దీంతో సదరు ప్రొడ్యూసర్లు వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోతున్నారని సమాచారం. అసలు జోక్ ఏంటంటే మొత్తం సినిమా బడ్జెటే 10 కోట్లు అంటేనే ఆలోచించే పరిస్థితిలో తనకొక్కడికే అంతిమ్మంటే ఎలా కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం. ఏమైనా కొంత లౌక్యంతో మన టైం వచ్చేవరకు పట్టువిడుపుగా వ్యవహరించకపోతే కష్టమే