Begin typing your search above and press return to search.

ఒకే రోజు ఐదు సినిమాల రచ్చ

By:  Tupaki Desk   |   21 July 2017 9:11 AM GMT
ఒకే రోజు ఐదు సినిమాల రచ్చ
X
తెలుగులో ఈ మధ్య వారానికి ఒక్క సినిమానే విడుదల అవుతోంది. దానితో సినిమా అభిమానులు కొంచెం ఏదో సర్ధుకుపోతున్నారు. కానీ ఈ వారం అటువంటి సినిమా అభిమానులుకు కొంత కొత్త బోజనం దొరకబోతుంది. ఈ వారం సినిమాలు అన్నీ పెద్ద స్టార్ సినిమాలు కాకపోయినా ప్రతి సినిమాకు దానికంటూ ఒక కొత్తదనం ఉండదినే చెప్పాలి. ప్రేమ - క్రైమ్ - థ్రిల్లర్ - హారర్ ఇలా అన్ని రకాల సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఈ రోజు విడుదల కాబోతున్నాయి.

వరుణ్ తేజ్ - సాయిపల్లవి నటించిన శేఖర్ కమ్ముల డైరక్షన్ చేసిన ఫిదా ఒకటే పెద్ద సినిమా అని చెప్పొచ్చు. విడుదలకు ముందు కూడా సాయిపల్లవి వచ్చిందే పాట ప్రోమో గా చేసి అందరిని మరింత ఆకర్షించారు ఫిదా టీమ్. శేఖర్ కమ్ముల ముందు కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చినా ఇప్పుడు అతనికి ఒక హిట్ కచ్చితంగా అవసరం పడింది. అలాగే వరుణ్ తేజ్ కూడ తన గత సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. ఫిదా కాకుండా మరో చెప్పుకోతగ్గ సినిమా అంటే అది సీనియర్ డైరెక్టర్ బి జయ డైరెక్ట్ చేసిన వైశాఖం. ఈ సినిమాతో హరీష్ హీరోగా పరిచయం చేస్తున్నారు. అవంతికా మిశ్రా గ్లామర్ ఆల్రెడీ టాక్ ఆఫ్‌ ది టౌన్ అయ్యింది. లేడీ డైరక్టర్ జయ డైరెక్ట్ చేయడం వలన సినిమా పాటలు కూడ హిట్ అవ్వడం సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వలన.. వైశాఖం సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ రెండు సినిమాలు కాకుండా మిగతా సినిమాలు లో ఒకటి దండుపాల్యం2 మరో రెండు టీమ్ 5 అండ్ మాయమాల్ సినిమాలు. ఈ రోజే విడుదల అవుతున్నాయి. క్రికెటర్ శ్రీసాంత్ చేసిన సినిమా అంటూ టీమ్ 5 గురించి ఊదరగొట్టారు కాని.. ఆ సినిమాకు అస్సలు క్రేజే రాలేదు. ఇక దండుపాల్యం 2 సినిమా మాత్రం చీకట్లో బాణం వేసినట్లు కేవలం న్యూడిటీ మరియు వయలెన్స్ ను అడ్డుపెట్టుకొని రంగంలోకి దిగింది. హీరోయిన్ సంజన న్యూడ్ సీన్ తో ఇప్పటికే అనవసరమైన రచ్చ చేసి అటెన్షన్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక మాయామాల్ సినిమా అయితే పోస్టర్లు తప్పిస్తే సినిమా గురించి పెద్దగా మ్యాటర్ అనేదే వినిపించలేదు. ఈ సినిమాలన్నింటి ఫేట్ ఎలా ఉంటుందో మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది.