Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఏజ్ లెస్ బ్యూటీలతో ఆలియా

By:  Tupaki Desk   |   27 Nov 2015 5:30 PM GMT
ఫోటో స్టోరీ: ఏజ్ లెస్ బ్యూటీలతో ఆలియా
X
మనీష్ మల్హోత్రా.. ఇండియా టాప్ డిజైనర్లలో ఈయన పేరే ముందుంటుంది. ఓ తరం వెనుకనుంచి తన టాప్ స్టేజ్ ని నిలబెట్టుకుంటున్న ఈ ఫ్యాషన్ డిజైనర్.. ఇప్పుడు 25 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్నాడు. దీంతో అందమైన భామలు కొందరికి స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రస్సులతో ఓ ఫోటో సెషన్ చేశాడు.

అలనాటి అందాల తార శ్రీదేవి - ఓ తరం వెనుక కుర్రాళ్లకి కిర్రెక్కించిన కరిష్మా కపూర్ - సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికీ మెరుపులు మెరిపిస్తున్న కరీనా కపూర్ - అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా యువత గుండెల్లో గూడు కట్టుకున్న కాజోల్.. వీరందరితోపాటు ఈ తరానికి ఇంటెలిజెంట్ హీరోయిన్ ఆలియా భట్.. ఈ ఐదుగురు కలిసి ఒకే ఫోటోలో అదిరిపోయే ఫోజ్ ఇచ్చేశారు.

మొత్తం అందరిలోకీ ఫ్రంట్ టోటల్ క్లీవేజ్ తో.. కరీనా కేకలు పెట్టిచేసింది. అలియా కూడా క్యూట్ లుక్స్ తో కుమ్మేసింది. కాజోల్ - కరిష్మాలు కాస్త పద్ధతైన డ్రస్సులే వేయగా.. చీర కట్టుకు స్పెల్లింగ్ నేర్పించేసింది శ్రీదేవి. ఇలా సీనియర్లతో కలిసి ఫోటో సెషన్ చేసే అవకాశం రావడం తన అదష్టంగా చెప్పుకొచ్చింది ఆలియా భట్. వోగ్ మేగజైన్ డిసెంబర్ ఎడిషన్ కోసం.. ఈ ఐదుగురు భామలు కలిసి ఇలా కలిసి పోజులిచ్చారు. ఏ వయసువారికైనా నప్పేలా డిజైన్ చేయడంలో.. తన స్పెషాలిటీ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మనీష్ మల్హోత్రా.