Begin typing your search above and press return to search.

వేలంటైన్స్ డే మూవీస్ దెబ్బేశాయట

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 PM GMT
వేలంటైన్స్ డే మూవీస్ దెబ్బేశాయట
X
వేలంటైన్స్ డే వస్తోందనగానే.. ఓ డిఫరెంట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సినమా ఇండస్ట్రీలో కూడా ఇది ప్రేమ చిత్రాలకు సీజన్ అన్నమాట. టాలీవుడ్ లో అంటే ఈ వేలంటైన్స్ డే ఆరాటం తక్కువే కానీ.. బాలీవుడ్ లో ఈ రోజు కోసం కొన్ని సినిమాలు ప్రత్యేకంగా ఎదురుచూస్తూ ఉంటాయి. ఈ ఏడాది అలా వచ్చిన సినిమాలే సనమ్ రే - ఫితూర్. పుల్కిత్ సామ్రాట్ - యామీ గౌతమ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా కూడా ఓ ప్రధాన పాత్ర పోషించింది. రిషి కపూర్ లాంటి సీనియర్ హీరో కూడా ఉండడంతో.. బోలెడన్ని అంచనాలతో ప్రేమికులు థియేటర్లకు వెళ్లిపోయారు.

మొత్తం సినిమాలో మ్యూజిక్ తప్ప.. మరో అంశం ఏదీ భరించలేకపోయామని జనాలు చెప్పుకుంటున్నారు. ఆ ఒక్కటి సరిగా లేకుంటే.. థియేటర్లలో ఇంతసేపు కూర్చున్నందుకు తమను తామే తిట్టుకోవాల్సిన పరిస్థితి అన్నది ఆడియన్స్ కామెంట్. ఇక ఇదే రోజు కోసం ఎదురుచూసి విడుదలైన మరో సినిమా ఫితూర్. బాలీవుడ్ టాప్ బ్యూటీ కత్రినా కైఫ్ - ఆదిత్య రాయ్ కపూర్ లు జోడీ కట్టిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. రణ్ బీర్ కపూర్ కి ఝలక్ ఇవ్వడానికి ఈ సినిమాలో కేట్ బాగా రెచ్చిపోయిందని అంచనాల మధ్య అభిమానులు థియేటర్లకు వెళితే.. అక్కడ ఎవ్వరినీ వదలకుండా బాదేశారని చెప్పుకుంటున్నారు.

ఢిల్లీ - లండన్ - పాకిస్తాన్.. ఇలా ఎక్కడికి ఎందుకు వెళుతోందో.. అర్ధం కాని రేంజ్ లో తెరకెక్కించారట. ఈ రెండు సినిమాలకు రివ్యూలు చాలా నెగిటివ్ గా ఉండగా.. దక్కిన రేటింగ్ ఒక పాయింటే. ఆడియన్స్ అయితే.. ఆ ఒక్క పాయింట్ ఎందుకిచ్చారని క్వశ్చన్ చేస్తున్నారంటే.. వేలంటైన్స్ డే కోసం రెండు రోజులు ముందే వచ్చిన సినిమాల పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. సహజంగా ప్రేమ సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ప్రేమికులకు కన్నీరే మిగులుతుందంటారు కానీ.. ఈ సినిమాలు చూసినోళ్లు మాత్రం నిజంగా కన్నీళ్లు పెట్టేసుకుంటున్నారు.