Begin typing your search above and press return to search.

విషాదాలతో బిగ్‌ బిలో క‌ల‌వ‌రం!!

By:  Tupaki Desk   |   11 Oct 2018 6:08 AM GMT
విషాదాలతో బిగ్‌ బిలో క‌ల‌వ‌రం!!
X
100 ఏళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో స‌గం ఆయ‌న పేరే వినిపిస్తుంది. ఒక స్టార్‌ గా ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ‌మైన ఇన్నింగ్స్ ఆయ‌న సొంతం. 76ఏళ్ల వ‌య‌సులోనూ మ‌రో డికేడ్ ఎదురేలేని స్టార్‌ గా ఏలేస్తున్నాడు. ఇండ‌స్ట్రీ బెస్ట్ సినిమాల్లో న‌టించేస్తూ ఇప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌నుడిలా క‌నిపిస్తున్నాడు. కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే కాదు - అన్ని భాష‌ల్లోనూ అమితాబ్ ప్ర‌భ క‌నిపిస్తోంది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనూ ఆయ‌న పేరు నిలిచిపోయేలా `సైరా` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

11 అక్టోబ‌ర్ 1942లో జ‌న్మించిన అమితాబ్ బ‌చ్చ‌న్ 1973లో `జంజీర్‌` అనే చిత్రంతో క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా కెరీర్‌ ని సాగించి ఇండియాస్ గ్రేట్ స్టార్‌ గా అవ‌త‌రించారు. ఒకానొక ద‌శ‌లో అమితాబ్ లైఫ్ పూర్తిగా డిప్రెష‌న్‌ లోకి వెళ్లిపోయింది. ఇండియాస్ బెస్ట్ స్టార్ అప్పుల పాలై - కోలుకోలేని ప‌రిస్థితిలో ఉన్నార‌న్న ప్ర‌చారం హోరెత్తింది. అయితే ఆ క్ర‌మంలోనే బుల్లితెర‌పై `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి` (కేబీసీ) రియాలిటీ షో అమితాబ్‌ ని నిల‌బెట్టింద‌ని - ఆ కార్య‌క్ర‌మం హోస్టింగ్ తెచ్చిన సంపాద‌న‌తోనే అప్పులు తీరాయ‌ని చెప్పుకున్నారు. నేడు త‌న 76వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. అయితే ఈ పుట్టిన‌ రోజుకు ఎలాంటి హ‌డావుడి లేదు. ప్ర‌తిసారీ త‌న కుమార్తెల ఇళ్ల‌లో ఏదో ఒక సంద‌డి ఉండేది. ఈసారి మాత్రం అలాంటిదేం లేద‌ని తెలుస్తోంది.

దీనికి కార‌ణం ఏంటి? అంటే.. అందుకు బంధువుల్లో వ‌రుస మ‌ర‌ణాలు తీవ్రంగా క‌ల‌చివేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. త‌న కుమార్తె శ్వేత‌బ‌చ్చ‌న్ నందా మామగారు రాజ‌న్ నందా ఇటీవ‌లే మ‌ర‌ణించారు. ఆయ‌న బ‌చ్చ‌న్‌ కి ఎంతో స‌న్నిహితుడు. అలానే బిగ్‌ బి ఎంత‌గానో అభిమానించే - సోద‌ర స‌మానురాలిగా భావించే రాజ్ క‌పూర్ భార్య కృష్ణ రాజ్‌ క‌పూర్ మ‌ర‌ణించ‌డం తీవ్రంగా బాధించింది. త‌న స్నేహితుడు రిషీ క‌పూర్ అమెరికాలో ఎంతో సీరియ‌స్ కండిష‌న్‌ లో మెడిక‌ల్ ట్రీట్‌ మెంట్‌ తో ఇబ్బందుల్లో ఉండ‌డం క‌ల‌చి వేసింది. అందుకే ఆయ‌న‌ సెలబ్రేష‌న్ మూడ్‌ లో లేరని తెలుస్తోంది.