Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : హమ్మయ్య సాహో ఫినిష్

By:  Tupaki Desk   |   16 July 2019 9:25 AM GMT
పిక్ టాక్ : హమ్మయ్య సాహో ఫినిష్
X
ఇంకా షూటింగ్ జరుపుకుంటూ అభిమానులను టెన్షన్ పెడుతూ వచ్చిన సాహో ఎట్టకేలకు పూర్తయ్యింది. ఓ పాట కొంచెం ప్యాచ్ వర్క్ కోసం ఇటీవలే ఆస్ట్రియా వెళ్ళిన టీం హైదరాబాద్ వచ్చాక కూడా బాలన్స్ పార్ట్ తీస్తూనే ఉంది. దీంతో నెలలో విడుదల పెట్టుకుని ఇంకా ఎంతకాలం తీస్తారనే కామెంట్స్ కూడా వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ప్రభాస్ షూట్ చివరి రోజు యూనిట్ తో దిగిన సెల్ఫిని పోస్ట్ చేయడంతో అందరూ హమ్మయ్య అనుకుంటున్నారు.

ఫోటోలో ప్రభాస్ కొంచెం కొత్తగా వెరైటీగా ఉండటం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. సో ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుందా అని లేక్కబెట్టుకోవడమే బాలన్స్. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు డబ్బింగ్ చేసుకుంటున్న సాహో ఈ నెలాఖరున సెన్సార్ కు వెళ్ళే అవకాశం ఉంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇకపై ప్రమోషన్ పై పూర్తిగా దృష్టి సారించనుంది సాహో టీం. ఇప్పటికే రెండు సంస్థలతో పబ్లిసిటీకి సంబంధించి ప్రత్యేక ఒప్పందాలు జరిగాయని ఇన్ సైడ్ టాక్.

వచ్చే మూడు వారాల టైం చాలా తక్కువ కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో సాహోకి హైప్ తీసుకురావాలి అంటే స్పెషల్ ట్రైలర్లతో పాటు ప్రత్యేకంగా గ్రాండ్ ఈవెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న సాహో మీద అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. సైకో సయ్య పాటకు ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో మిగిలిన సాంగ్స్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఇకపై మెట్రో స్పీడ్ తో అప్ డేట్స్ రావడం ఖాయమే