హిట్ వచ్చినా ఆమెకు గడ్డు కాలమే

Sun Feb 10 2019 16:48:55 GMT+0530 (IST)

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అంటే ఠక్కున వినిపించే పేర్లలో కంగనా రనౌత్ ఉంటుంది. ఆ స్టార్ డం వల్లనో లేక మరేంటో కాని సినిమా సినిమాకు వివాదాలను ఈమె పెంచుకుంటూనే పోతుంది. తాజాగా 'మణికర్ణిక' చిత్రంతో ఈమె ఇంతగా వివాదాస్పదం ఎందుకు అవుతుందో తేలిపోయింది. కంగనాకు ఈగో ఎక్కువ తాను అనుకున్నది చేసేంత వరకు ఊరుకునే మనిషి కాదు. సినిమా క్రియేటివ్ సైడ్ లో తాను అనుకున్నట్లుగా దర్శకుడు ఇంప్లిమెంట్స్ చేయకుంటే ఆమె ఊరుకోదు.'మణికర్ణిక' చిత్రం విషయంలో క్రిష్ కు ఆమెకు క్రియేటివ్ విషయంలో వివాదం తలెత్తింది. కంగనా ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయని కారణంగానే కంగనా పట్టుబట్టి మరీ ఆయన్ను సినిమా నుండి తప్పుకునేలా చేసింది. 'మణికర్ణిక' విడుదలైన తర్వాత క్రెడిట్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. క్రిష్ తనకు జరిగిన అన్యాయంను మీడియా ముందుకు తీసుకు వచ్చాడు. దర్శకుడి మాట వినకుండా దర్శకత్వంలో వేలు పెట్టడంతో పాటు తనకు ఇష్టం వచ్చినట్లుగా స్క్రిప్ట్ లో  మార్పులు చేర్పులు చేయిస్తుందని అందుకే గతంలో ఈమెతో వర్క్ చేసిన వారు ఈమెతో గొడవలు పడ్డారంటూ బాలీవుడ్ లో ఒక వర్గం మీడియా కథనాలు రాస్తోంది.

ఈసమయంలోనే కంగనా తర్వాత సినిమా విషయంలో సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంగనాతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఎవరు కూడా ఆసక్తి లేరు. ఎందుకంటే కంగనా డైరెక్షన్ లో వేలు పెడుతుందని అందుకు ఒప్పుకోకుంటే ఈగో హర్ట్ అయ్యి ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం లేదా తమను తప్పించడం చేస్తుందని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు భవిష్యత్తులో కూడా కంగనాతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఆసక్తిని కనబర్చడం లేదు.

ఇదే కనుక కొనసాగితే కంగనాకు గడ్డు కాలం మొదలైనట్లే అంటున్నారు. ఒకటి ఆమె సొంతంగా సినిమాలు చేయాలి లేదంటే ఆమె చిన్న దర్శకులతో సినిమాలను కానిచ్చేయాలి. ఆ రెండు కూడా ఆమె కెరీర్ ను నాశనం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.