Begin typing your search above and press return to search.

ఇళ్లకీ వచ్చేస్తోన్న ఆర్ట్ డైరెక్టర్లు

By:  Tupaki Desk   |   23 Jun 2017 3:49 AM GMT
ఇళ్లకీ వచ్చేస్తోన్న ఆర్ట్ డైరెక్టర్లు
X
ఆర్ట్ డైరెక్టర్స్.. గతంలో వీరి పని సినిమాలకు మాత్రమే పరిమితం అయేది. సీన్ కి తగినట్లుగాను.. దర్శకుడు విజన్ కి అనుగుణంగాను.. షూటింగ్ కి కన్వీనియెంట్ గా.. ఇలా సెట్స్ డిజైనింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు వీరి పరిధి పెరిగిపోయింది. మెల్లగా ఇతర విభాగాల్లోకి వచ్చేస్తున్నారు.. కాదు కాదు.. తీసుకొచ్చేస్తున్నారు ఫిలిం మేకర్స్.

ఈ జనరేషన్ లో దర్శకులు తమ ఇళ్లు.. ఆఫీసులు.. ఫాం హౌస్ లను ఆర్ట్ డైరెక్టర్స్ తో డిజైన్ చేయించుకుంటున్నారు. ఆయా దర్శకులతో సుదీర్ఘకాలం పనిచేసిన కళా దర్శకులకు.. ఈ బాధ్యతలు అప్పగింస్తున్నారు సినీ దర్శకులు. సురేందర్ రెడ్డి.. శ్రీను వైట్లతో పాటు పలువురి ఇళ్లకు డిజైన్ చేశారు నారాయణ రెడ్డి. ముఖ్యంగా ఆఫీసుల విషయంలో సినిమా లుక్ కోరుకుంటారని.. సెట్స్ కు దూరంగా ఉన్నా.. ఆ భావనలో ఉండేందుకు వీలుగా ఈ డిజైనింగ్ ఉండేలా చూస్తామని చెప్పారు నారాయణ రెడ్డి.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎస్ ఎస్ రాజమౌళి ఆఫీసులను డిజైన్ చేస్తున్నారు రవీందర్ రెడ్డి. వైవిధ్యం చూపించే తన శైలి కారణంగా తనకు ఈ అవకాశం లభించినట్లు చెబుతున్నారు. అయితే.. సినిమాకు సెట్ వేయడానికి.. ఆఫీస్ సెటప్.. ఇల్లు డిజైన్ చేయడానికి చాలా అంతరం ఉందన్నది వీరి ఉమ్మడి వాదన. సినిమా సెట్ కొంత కాలం కోసమే. పైగా అక్కడ షూటింగ్ కి అనుకూలత అనే పాయింట్ ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు.

కానీ ఇళ్లు.. అఫీసుల విషయానికి వస్తే ఇవి పర్మనెంట్ గా ఉంటాయని.. ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలతో పాటు.. బోలెడంత కన్వీనియెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆర్ట్ డైరెక్టర్స్. నిర్మాణం కంటే.. ఇంటీరియర్స్ ఏర్పాటుకు ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు వీరంతా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/