Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఈ వారసులు మొదలయ్యారా

By:  Tupaki Desk   |   25 April 2018 7:49 AM GMT
ఇప్పుడు ఈ వారసులు మొదలయ్యారా
X
వారసత్వం అనేది ప్రతీ రంగంతో పాటే సినీ పరిశ్రమలో కూడా ఉంటుంది. మన దగ్గర ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంటుందంతే. తమ పేరెంట్స్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారు కాబట్టి.. చిన్నప్పటి నుంచి ఆ పరిశ్రమతో టచ్ లో ఉండడం.. ఇండస్ట్రీలోనే భవిష్యత్తు చూసుకోవాలనే కోరికకు కారణం కావచ్చు.

కానీ.. అటు హీరోల దగ్గర నుంచి.. హీరోయిన్లు.. కమెడియన్లు.. దర్శకులు.. నిర్మాతలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా ప్రతీ ఒక్కరు తమ పుత్రరత్నాలను హీరోలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య రాజకీయ నాయకుల వారసులు కూడా ఓ చెయ్యేసి చూస్తున్నారు. ఇప్పడు ఫైట్ మాస్టర్ల శకం ఆరంభం అయినట్లుగా కనిపిస్తోంది. ఫైట్ మాస్టర్ గా విజయ్ కు బోలెడంత గుర్తింపు ఉంది. ఇతని కుమారుడు రాహుల్ విజయ్.. ఇప్పుడు హీరో అయిపోతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. 'ఈ మాయ పేరేమిటో' అంటూ టైటిల్ ను డిసైడ్ చేయగా.. దాన్ని ప్రకటించడం కోసం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు.

రాహుల్ కు జోడీగా కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమా బాగా ఎంటర్టెయిన్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ సంగతేమో కానీ.. ఇండస్ట్రీలో ఓ వారసుల గోల ఏమిటో.. ఇలా ఫైట్ మాస్టర్లు కూడా తమకున్న పలుకుబడిని ఉపయోగించి.. తమ పిల్లలను హీరోలుగా మార్చడం చూస్తుంటే.. ఇంకెన్ని క్రాఫ్టుల నుంచి వారుసులు పుట్టుకొస్తారో అనుకుంటున్నారు ఆడియన్స్.