Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో తెలుగు పంచ్ పవర్

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:43 AM GMT
బాలీవుడ్ లో తెలుగు పంచ్ పవర్
X

అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి సైలెంట్ గా వచ్చి డీసెంట్ హిట్ కొట్టింది క్షణం మూవీ. అడవి శేష్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. స్టోరీ కూడా కొత్తగా అనిపించడంతో మిగిలిన భాషల్లోనూ ఈ సినిమా రైట్స్ కు మంచి డిమాండ్ వచ్చింది.

క్షణం హిందీ వెర్షన్ ను బాఘీ-2 పేరిట యాక్టర్ జాకీ ష్రాఫ్ కొడుడు టైగర్ ష్రాప్ హీరోగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో థ్రిల్లర్ ఎలిమెంట్ కన్నా యాక్షన్ కే ప్రాధాన్యం ఇచ్చారని అది చూసిన ఎవరికైనా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఒకటి... రెండు ఫైట్స్ అదరహో అనిపించేట్టే ఉన్నాయి. వీటిని కంపోజ్ చేసింది మన తెలుగువాళ్లే. కవల సోదరులైన ఫైట్ మాస్టర్లు రామ లక్ష్మణ్ లు ఈ బాలీవుడ్ సినిమాకు రూపొందించిన ఫైట్లు హాలీవుడ్ సినిమాను తలదన్నే రీతిలో ఉన్నాయని యాక్షన్ ప్రియులు అంటున్నారు. ఈ సినిమాలో సగానికిపైగా యాక్షన్ సీన్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలోనే తెరకెక్కడం విశేషం.

యాక్షన్లు సీన్లతో దట్టించి తీసిన బాఘీ-2 మూవీలో హీరోయిన్ పాత్రను లోఫర్ ఫేం దిశా పటానీ చేస్తోంది. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ మూవీని అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే నెలాఖరుకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మన తెలుగు ఫైట్ మాస్టర్ల పంచ్ పవర్ ఏ మేరకు పనిచేసిందో చూసేందుకు వెయిట్ అండ్ సీ.