Begin typing your search above and press return to search.

ఆ డైనమిజం తెరపై చూడండి -విజయన్‌

By:  Tupaki Desk   |   3 Sep 2015 1:43 AM GMT
ఆ డైనమిజం తెరపై చూడండి -విజయన్‌
X
దేవకట్టా నేరేషన్‌ లోని డైనమిజం, విష్ణు పెర్ఫా మెన్స్‌ డైనమైట్‌ కి ప్రధాన అస్సెట్స్‌. తెలుగులో ఇలాంటి జోనర్‌ ఇంతవరకూ రానేలేదు. ఇదో డిఫరెంట్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రం లోని ఫైట్స్‌ మాస్‌ ని టచ్‌ చేస్తాయని అంటున్నారు విజయన్‌ మాష్టర్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ .. మూడు పరిశ్రమల్లో ఫైట్‌ మాష్టర్‌ గా పేరు తెచ్చుకున్న విజయన్‌ లేటెస్టు గా దేవాకట్టా దర్శకత్వం లోని డైనమైట్‌ కి ఫైట్స్‌ అందించారు.

ఈ సందర్భం గా సినిమా గురించి చెబుతూ పైవిధం గా స్పందించారు. విష్ణు ఈ చిత్రం కోసం ఫైట్స్‌ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తన క్యారెక్టర్‌ కి పూర్తి స్థాయి లో న్యాయం చేశాడు. విష్ణు కెరీర్‌ లోనే ది బెస్ట్‌ చిత్రమవుతుంది. అలాగే ఈ చిత్రం తమిళ మాతృక అరిమా నంబి తో దీనికి పోలికలు కనిపించవు. అక్కడ ఉన్న ల్యాగ్స్‌ లేకుండా తెలివి గా స్క్రిప్టు ని మార్చు కున్నారు... అని మాష్టర్‌ చెప్పారు.

త్వర లోనే మా అబ్బాయిని తమిళ తెరకి హీరో గా పరిచయం చేస్తున్నా. ఓ వైపు ఆ పనుల్లో బిజీ. మరో వైపు బాలీవుడ్‌ సినిమాల కు పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా జీవితం సాగిపోతోంది. అంటూ ముగించారు విజయన్‌ మాష్టర్‌. ఇక పోతే డైనమైట్‌ సినిమాను నిన్న దేవకట్టా, ఇవాళ మోహన్‌ బాబు అలాగే విజయన్‌ మాష్టర్‌ ఇలా పొగిడేస్తుంటే.. అసలు ఈ సినిమాలో అంతలా ఏముందబ్బా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది కదూ.