Begin typing your search above and press return to search.

శునకం సాహసం..పిల్లల కోసం పాముతో ఫైట్

By:  Tupaki Desk   |   20 Sep 2018 9:12 AM GMT
శునకం సాహసం..పిల్లల కోసం పాముతో ఫైట్
X
ఓ శునకం.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తన పిల్లలకు పాలిస్తూ సేదతీరుతోంది. కానీ అప్పుడే ఎక్కడి నుంచో ఓ భారీ తాచు పాము అక్కడికి వచ్చింది. చిన్ని శునక పిల్లలను తినేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన తల్లి శునకం పాముతో ఫైట్ కు రెడీ అయ్యింది. తన ప్రాణాలకు తెగించి మరీ వాటిని కాపాడుకునేందుకు పోరాడింది. ఈ పోరు రసవత్తరంగా సాగింది. శునకం, పాము ఫైట్ ను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

కుక్క అరుపులకు అక్కడికి వచ్చిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ వారు రావడానికి ఆలస్యమైంది. ఈ కుక్క-పాము ఫైట్ లో తల్లి శునకం ఎంత ప్రయత్నించినా తన పిల్లలను కాపాడుకోలేకపోయింది. పాము కాటుకు మూడు పిల్ల శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. ఒక్క పిల్ల శునకాన్ని మాత్రమే తల్లి కాపాడుకోగలిగింది.. చివరకు స్థానికులు ఆ పామును కర్రలతో వెళ్లగొట్టారు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్ లో జరిగింది. తాచుపాము-శునకం భీకర ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.