Begin typing your search above and press return to search.

కమ్ముల తర్వాత ఎన్టీఆర్-సుక్కు

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:56 AM GMT
కమ్ముల తర్వాత ఎన్టీఆర్-సుక్కు
X
నాన్నకు ప్రేమతో.. ఎన్టీఆర్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కి హిట్టయిన సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. అమెరికాలో అదరగొట్టింది. ఎన్టీఆర్ కు తొలి 2 మిలియన్ డాలర్ల సినిమాగా నిలిచింది. ఈ చిత్రం ఫుల్ రన్లో అక్కడ 2.0224 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ వసూళ్లను శేఖర్ కమ్ముల సినిమా ‘ఫిదా’ దాటేయడం విశేషం. మెల్లగా మొదలై.. హరికేన్ లాగా విజృంభించిన ఈ సినిమా అమెరికాలో అసాధారణ వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే 2 మిలియన్ డాలర్ మార్కును దాటిన ఈ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ను కూడా దాటేసి ఆల్ టైం తెలుగు హైయెస్ట్ గ్రాసర్లలో ఆరో స్థానానికి చేరుకుంది.

‘బాహుబలి: ది కంక్లూజన్’ 20.57 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ‘బాహుబలి: ది బిగినింగ్’ 6.99 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీమంతుడు (2.89 మిలియన్లు).. అఆ (2.449 మిలియన్లు).. ఖైదీ నంబర్ 150 (2.447 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిలో ఒక్క ‘అఆ’ మాత్రమే పెద్ద సినిమా కాదు. ఐతే దానికి కూడా త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడి అండ ఉంది. నితిన్-సమంత కూడా ఓ మోస్తరు స్థాయి ఉన్నవాళ్లే. కానీ ‘ఫిదా’కు అలాంటి అట్రాక్షన్ లేదు. శేఖర్ కమ్ముల ఫామ్ లో లేడు. వరుణ్ తేజ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. సాయిపల్లవి కొత్తమ్మాయి. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటడం అనూహ్యమైన విషయమే.