సలహా ఇచ్చారు.. బ్లాక్ చేసింది!

Fri May 24 2019 22:46:25 GMT+0530 (IST)

ఈ సోషల్ మీడియా అనేది ఒక మహా సముద్రం. ఇందులో అన్నిరకాల జనాలు ఉంటారు. మంచివారు.. చెడ్డవారు.  పర్వర్టులు.. సైకోలు.. పనిలేని వాళ్ళు.. ట్రోలర్లు ఇలా అన్నిరకాల జనాలు ఉంటారు. మనలాంటి సాధారణ నెటిజనులకే సోషల్ మీడియాలో విమర్శల పాలవకుండా తప్పించుకోవడం కష్టం. ఇక సెలబ్రిటీలకు కత్తిమీద సాము లాంటిది. రీసెంట్ గా 'దంగల్' ఫేమ్ ఫాతిమా సనా షేక్ కు ఒక నెటిజనుడు ఉచిత సలహా ఇవ్వడంతో గట్టిగా అతనికి రిటార్ట్ ఇచ్చింది. ఇప్పుడదో హాట్ టాపిక్ అయింది.ఇంతకీ విషయం ఏంటంటే ఫాతిమా ముస్లిం అమ్మాయే కానీ ఈ జనరేషన్ కు చెందిన మోడరన్ అమ్మాయి. దీంతో వెస్టర్న్ దుస్తులు ధరిస్తుంది. ఫోటో షూట్స్ లో పాల్గొంటుంది. అయితే తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో ఒక నది ఒడ్డున సాయం సమయాన కూర్చొని ఉంది.  షర్టు ప్యాంట్ వేసుకొని ఫుల్ డ్రెస్ లో ఉంది.  దీనికి ఒక షాయరీ లాంటి  క్యాప్షన్  కూడా ఇచ్చింది.   అయితే ఈమధ్య కొందరు నెటిజనులు ఆమెకు డ్రెస్ విషయంలో సలహాలు ఇస్తున్నారు.  అలానే ఒక నెటిజనుడు ఫాతిమాను మీ శరీరాన్ని పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించమని కోరాడు. "ఫాతిమా మీరో ముస్లిం అని మనసులో పెట్టుకొని ప్రవర్తించండి" అంటూ సలహా ఇచ్చాడు. అంతే కాదు తన సలహా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి అని చెప్పాడు.  సదరు నెటిజనుడు ఎంతో మర్యాదగా చెప్పినప్పటికీ ఫాతిమాకు ఆ సలహా నచ్చలేదు.  

"మీరు నాకు స్నేహితులు. మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా. నా శరీరం.. నా రూల్స్." అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.  దీంతో ఇది సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది.  చాలామంది ఫాతిమాకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అయితే కొందరు మాత్రం సదరు నెటిజనుడు చెప్పిన విషయంలో తప్పేమీ లేదని.. ఇది రంజాన్ సీజన్ కాబట్టి హుందాగా నడుచుకోవాలని అన్నారు. ఇంతకీ ఫాతిమా పోస్ట్ చేసిన ఏ ఫోటో కింద ఈ చర్చలు సాగాయని మీకు అనుమానం రాలేదా? మీరు పైన చూస్తున్నదే సదరు ఫోటో.