ఫ్లాప్ పుత్రరత్నాలు.. గట్సీ డాడ్స్!!

Mon Nov 26 2018 13:51:39 GMT+0530 (IST)

ఫ్లాపొచ్చినా పుత్రరత్నాలకు అండనిచ్చే డాడ్ లను ఏమనాలి? దేవుళ్లు అనే అనాలి. ఏ కొడుకు అయినా నాన్నకు చిట్టికన్నే కాబట్టి.. సుపుత్రులు కెరీర్ లో రాణించే వరకూ అండగా నిలిచే తత్వం సహజంగానే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న టఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కొని నిలవాలంటే వారసత్వ హీరోలకు కష్టంగా ఉన్న రోజులివి.  నాని - విజయ్ దేవరకొండ లాంటి వేవ్స్ మధ్య దివ్వెలు  వెలిగించేందుకు సుపుత్రుల్ని తీర్చి దిద్దే గట్స్ ఆ డాడ్ లకు ఉండాలి. అంతకుమించి డబ్బును మంచి నీళ్లలాగా ఖర్చు పెట్టే నిర్మాతను తెచ్చే సత్తా ముఖ్యం. అదీ కుదరకపోతే తామే పెట్టుబడుల్ని సమకూర్చి నమ్మకమైన దర్శకుడి చేతిలో పెట్టగలిగే సత్తా అయినా ఉండాలి.ఈ విషయంలో ఓ నలుగురు హీరోల డాడ్ లు మాత్రం రియల్ గట్స్ తో ఆల్వేస్ ఇండస్ట్రీ హాట్ డిబేట్ కు కారణం అవుతున్నారు. ఇప్పటికే వరుసగా రెండు ఫ్లాప్‌లు ఇచ్చిన ప్రముఖ హీరో కుమారుడు ఈసారి ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ తో సత్తా చాటుతాననే కసితో దూసుకొస్తున్నాడు. తనకు కావాల్సినంతా బూస్ట్ ఇస్తూ సదరు డాడ్ అంతే పట్టుదలగా ఉండడం అభిమానుల్లో హాట్ టాపిక్. రాజీ లేకుండా హార్డ్ వర్క్ చేస్తున్న ఆ యంగ్ హీరో ఫస్ట్ లుక్ తో ప్రామిస్సింగ్ ట్రీట్ ఉందని కాన్పిడెన్స్ ఇచ్చాడు. ఇకపోతే తొలి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నా.. హిట్టు అన్న టాక్ అందుకుని అటుపై వరుసగా నాలుగైదు ఫ్లాపుల్లో నటించిన వేరొక యంగ్ హీరో సైతం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తుండడం - తనకు డాడ్ నుంచి అన్ని రకాల సపోర్ట్ దక్కడం ఆశ్చర్యపరచక మానదు. అప్పులోళ్ల వేధింపులున్నాయంటూనే - కుమారుడిని టాప్ హీరోని చేయాలన్న సంకల్పం చూపిస్తున్న ఆ డాడ్ ని చూస్తే ఎవరికైనా మతిచెడాలి.

ఆ ఇద్దరి కథ అలా ఉంటే - మరో ఇద్దరి కథ వేరేగా ఉంది. తనకు స్టార్ హీరోలు అవకాశాలివ్వలేదన్న కసితో ఆ డైరెక్టర్ ఏకంగా కొడుకునే బరిలో దించి - ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు అమ్మి.. తానే నిర్మాతగా మారి..  ఇండస్ట్రీకి తానేంటో చూపించాలనుకున్నారు. కానీ - తొలి ప్రయత్నం ఊహించని రీతిలో విఫలమైంది. అయినా కొడుకుపై మమకారం ఇంకా పెరిగిందే కానీ తరగలేదు. అంతకుమించిన కసితో కుమారుడిని స్టెన్ గన్ లా .. టెరాబైట్ స్పీడ్ తో దూసుకొచ్చే 2.ఓలా తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకోసం తన శిష్యుల్ని బరిలో దించి కథలు తయారు చేయించాడు. రాబోవు ఫిబ్రవరిలో కుమారుని రెండో సినిమా లాంచ్ ఉంటుందన్న మాటా వినిపిస్తోంది. ఇక ఇండస్ట్రీ శతాధిక చిత్రాల హీరో కుమారుడు ఓ టెస్ట్ డ్రైవ్ ట్రై చేసినా అది ఫెయిలైంది. ఆ క్రమంలోనే 2019లో పునరుత్తేజంతో రీలాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ నలుగురు పుత్ర రత్నాల విషయంలో ఓ ప్రశంస మాత్రం ఆడియెన్ లో బలంగా ఉంది. ఈ కుర్రాళ్లు నటించిన సినిమాలు ఫ్లాపై ఉండొచ్చు కానీ వీళ్ల ప్రతిభ విషయంలో సందేహించాల్సిన అవసరం అయితే లేనేలేదు. సదరు పుత్ర రత్నాలకు ఎంతో మంచి భవిష్యత్ ఉంది. తెలిసో తెలియకో చేసిన కొన్ని తప్పిదాలు - చెత్త ఎంపికలు కెరీర్ ఆరంభం పరాజయాలై పంటికింద రాయిలా తగిలాయి. తప్పుల నుంచి నేర్చుకుని సరికొత్తగా ఈ యంగ్ హీరోలు అందరి అండదండలతో తమని తాము ఆవిష్కరించుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు.