బేగమ్ జాన్.. రేసింగులు దెబ్బేశాయ్

Fri Apr 21 2017 15:17:56 GMT+0530 (IST)

ది డర్టీ పిక్చర్ తో మొత్తం ఇండియాకి తెలిసివచ్చింది విద్యా బాలన్ సొగసు. అంత వరుకు ఒక మంచి నటి అని మాత్రమే అనిపించుకుని.. ఆ సినిమా తో తను మాస్ ని కూడా ఆకట్టుకోగలను అని ఋజువుచేసింది.  మ్యాటర్ ఏంటంటే.. ఆమె కొత్త సినిమా ''బేగమ్ జాన్''లో ఏకంగా ఒక బ్రోతల్ నడిపే లేడీ క్యారెక్టర్ చేసి అందరికీ షాకిచ్చింది. గత వారం రిలీజైన ఈ షాకులు బాక్సాఫీస్ దగ్గర అస్సలు వర్కవుట్ కాలేదు.

బేగమ్ జాన్ వసూళ్ళు చూసుకుంటే.. శుక్ర వారం - 3.94 కోట్లు నెట్.. శనివారం - 3.51.. ఆదివారం - 4.03.. సోమవారం - 1.87.. మంగళవారం - 1.59. మొత్తంగా -14.94 కోట్లు వ్యాపారం చేసింది. చూస్తుంటే అస్సలు ఏ మాత్రం నెంబర్లు ఎంకరేజింగ్ గా కనిపించట్లేదనే చెప్పాలి. హైప్ బాగానే ఉండడంతో శుక్ర వారం ఆదివారం నాడు ఆమాత్రం కలెక్షన్స్ చేయగలిగింది కాని.. తరువాత సోమవారం నుండి ఢమాల్ అనేసింది. ఈ సినిమా బెంగాలీ మూవీ రాజ్ కాహిని ఆధరంగా తీయడం జరిగింది. కథంతా పార్టీషన్ జరిగినప్పుడు వేశ్యలు.. అప్పటి పంచాయితీ గవర్నమెంట్ వాళ్ళకి..  ఒక ఇంటి కోసం జరిగిన లడాయి. బెంగాలీ సినిమా ఫార్మాట్  హింది వాళ్ళకి ఎక్కినట్లు లేదు.. అందుకే ఇప్పుడు ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోయింది. దానికితోడు ఇంకో రీజన్ కూడా ఉందండోయ్.

ఈ సినిమాతోపాటే ఇండియాలో ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ 8 కూడా వచ్చింది. కాబట్టి యూత్ ఎక్కువగా విద్యా బాలన్ వేషాలకంటే కూడా.. అటు కార్ల రేసింగులు చూడ్డానికే మక్కువ చూపించేశారు. అందుకే విద్యా బాలన్ చేసిన గడిచిన ఆరు సినిమాలకంటే.. బేగమ్ జాన్ కు తొలి వీక్ గ్రాస్ చాలా తక్కువగా వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/