వంశీ రొమాన్సు పిండేస్తున్నాడే!!

Fri Apr 21 2017 22:09:32 GMT+0530 (IST)

సీనియర్ డైరక్టర్ వంశీ ఇప్పుడు లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ తో వస్తున్నాడు. మధుర శ్రీధర్ నిర్మాణంలో వస్తున్న ఈ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాను.. ఆద్యంతం వంశీ తన రసికతతో నింపేశాడేమో అనిపించకమానదు. ఇప్పుడు రిలీజైన కొత్త సాంగ్ వీడియో ఒకటి చూస్తుంటే.. ఆ విషయం ఇట్టే మనం అర్ధం చేసుకోవచ్చు.

రవి వర్మ చిత్రమా.. అంటూ సాగే ఒక రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేశాడు వంశీ. తన లేడీస్ టైలర్ ప్రొడ్యూస్ చేసిన స్రవంతి రవికిషోర్ చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. ఇక యథావిథిగా మణిశర్మ తన మ్యూజిక్ తో మాంచి కిక్కే ఇవ్వగా.. వంశీ మాత్రం హీరోహీరోయిన్ల మధ్యన పండించిన స్పయిసీ కెమిస్ర్టీ ఒక రేంజులో ఉంది. సుమంత్ అశ్విన్ సంగతేమో కాని.. హీరోయిన్ మనాలి రాథోడ్ మాత్రం తన ఒంపుసొంపులతో కాస్త నాటుగానే అందాలను దారబోసింది. ఈ అందాలను వంశీ మార్కు క్రియేటివ్ బ్లాకుల్లో చూస్తుంటే.. పొరపాటను వంశీని ఎప్పటినుండో పుట్ బాల్ ఆడుకుంటున్న ఆ సక్సెస్ ఇప్పుడు దగ్గరకు పిలిచి దరికి చేర్చుకుంటుందా అనిపించక మానదు.

ఇకపోతే ఈ సినిమాను మే 3వ వారంలో రిలీజ్ చేయాలని గట్టి ప్లాన్సే చేస్తున్నారు. సరిగ్గా అదే టైములో బాబు బాగా బిజీ.. రారండోయ్ వేడుక చూద్దాం.. వంటి సినిమాలు కూడా రిలీజవుతుండటంతో.. ఈ సినిమాల రేస్ బాక్సాఫీస్ దగ్గర మాంచి టఫ్ గానే ఉండబోతోంది మరి. Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/