వెండి తెర మీద సానియా మెరుపులు!

Mon Jun 19 2017 20:26:22 GMT+0530 (IST)

మీరు విన్నది నిజమే. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రానున్న రోజుల్లో వెండితెర మీద మెరుపులు మెరపించనున్నారు. టెన్నిస్ కోర్టులతో పదునైన షాట్లు.. ఏస్ లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఈ సుందరి.. గ్లామర్ విషయంలోనూ ఆమెకున్న పేరు ప్రఖ్యాతులు ఎంతన్నది అందరికి తెలిసిందే.

ఇప్పటివరకూ కొన్ని బ్రాండ్లకు ప్రచారం కోసం కెమేరా ముందుకు వచ్చిన ఆమె.. తాజాగా ఒక సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ సానియా సినిమా ముచ్చట గురించి వివరాలు బయటపెట్టారు. సానియా ఒక సినిమాలో నటించనున్నట్లుగా చెప్పిన ఆయన.. అంతకు మించి మాట చెప్పేందుకు అస్సలు ఇష్టపడలేదు.

సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కథాంశంతోనే ఈ సినిమా ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. టెన్నిస్ స్టార్ గా ఇరగదీసిన సానియా.. వెండితెర మీద మరెన్ని మెరుపులు మెరిపిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/