Begin typing your search above and press return to search.

ఒలింపింక్స్ కి సల్మాన్ తో లింక్ ఏంటో

By:  Tupaki Desk   |   30 April 2016 5:50 AM GMT
ఒలింపింక్స్ కి సల్మాన్ తో లింక్ ఏంటో
X
సల్మాన్ ఖాన్ ను రియో ఒలింపిక్స్ కు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై వివాదం ముదురుతోంది. దేశంలో ఇంతమంది గొప్ప క్రీడాకారులు ఉండగా.. ఓ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై బాలీవుడ్ తో పాటు పలువురు క్రీడాకారులు కూడా పెదవి విప్పారు.

లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్.. సల్మాన్ ఎంపిక పై ప్రశ్నించాడు. మిల్కా సింగ్ పై వచ్చిన బయోపిక్ లో నటించిన ఫర్హాన్ అక్తర్ కూడా స్పందించాడు. అయితే.. ఈ ఉన్నత పదవికి బాలీవుడ్ నటుడికి బదులుగా ఓ స్పోర్ట్స్ పర్సన్ నే ఎంపిక చేస్తే బాగుండేదనే మిల్కా సింగ్ అన్నారు తప్ప.. సల్మాన్ ను విమర్శించలేదని వివరించాడు ఫర్హాన్. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం తెలియక సల్మాన్ తండ్రి సలీంఖాన్ అపార్ధం చేసుకున్నారని కూడా ఫర్హాన్ చెప్పుకొచ్చాడు.

తాను కూడా గుడ్ విల్ అంబాసిడర్ అనే అంశంపై తప్ప.. సల్మాన్ గురించి మాట్లాడ్డం లేదని స్పష్టం చేశాడు ఫర్హాన్ అక్తర్. అయితే.. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా అభినవ్ బింద్రాను ఒలిపింక్ అసోసియేషన్ అడడం, ఒప్పుకోవడం జరిగిపోయాయి. మరి సల్మాన్ తో పాటు ఎంపిక చేస్తారా, సల్మాన్ ప్లేస్ లో బింద్రాను తీసుకున్నారా అనే విషయం తేలాల్సి ఉంది.